unfoldingWord 31 - యేసు నీళ్ళమీద నడవడం
เค้าโครง: Matthew 14:22-33; Mark 6:45-52; John 6:16-21
รหัสบทความ: 1231
ภาษา: Telugu
ผู้ฟัง: General
เป้าหมายของสื่อบันทึกเสียง: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
สถานะ: Approved
บทความเป็นแนวทางพื้นฐานสำหรับการแปลและบันทึกเสียงภาษาอื่นๆ ควรดัดแปลงตามความจำเป็นเพื่อให้เข้าใจและเหมาะสมกับวัฒนธรรมและภาษาแต่ละภาษา คำศัพท์และแนวคิดบางคำที่ใช้อาจต้องอธิบายเพิ่มเติม หรือแทนที่ หรือตัดออก
เนื้อหาบทความ
ఐదువేల మందికి ఆహారాన్ని పంచిన తరువాత ప్రభువైన యేసు తన శిష్యులకు పడవలోనికి వెళ్లాలని చెప్పాడు. సముద్రం ఆవలి వైపుకు వెళ్లాలని ఆయన వారిని కోరాడు. ఆయన సముద్రం ఒడ్డున కొంతసేపు నిలిచాడు. కనుక శిష్యులు పడవలో బయలుదేరారు. యేసు జనసమూహములను తమ గృహాలకు పంపివేసాడు. తరువాత ఆయన ప్రార్థన చెయ్యడానికి కొండమీదకు వెళ్ళాడు, రాత్రంతా పార్థన చెయ్యడంలో ఆయన ఒంటరిగా సమయాన్ని గడిపాడు.
ఈ సమయంలో శిష్యులు పడవ నడుపుతూ ఉన్నారు, అయితే వారి పడవకు వ్యతిరేకంగా పెద్ద గాలి వీస్తుంది, అర్థరాత్రి సమయంలో వారు సముద్రం మధ్యలో ఉన్నారు.
ఆ సమయంలో ప్రభువు తన ప్రార్థనను ముగించి తన శిష్యులను కలుసుకోడానికి వెళ్ళాడు. ఆయన నీళ్ళ మీద నడుస్తూ పడవ వద్దకు వస్తున్నాడు.
శిష్యులు ఆయనను చూచారు, వారు చాలా భయపడ్డారు ఎందుకంటే ఆయన ఒక భూతం అని భావించారు. వారు భయపడ్డారని యేసుకు తెలుసు. కనుక ఆయన వారిని పిలిచాడు, “భయపడకండి. నేనే!” అని చెప్పాడు.
అప్పుడు పేతురు ప్రభువుతో ఇలా చెప్పాడు, “ప్రభూ, ఇది నీవే అయితే నీటి మీద నడుస్తూ నీ వద్దకు రావడానికి నాకు అనుమతి ఇవ్వు.” అందుకు ప్రభువు పేతురుతో “రమ్ము” అని చెప్పాడు.
కనుక పేతురు పడవలోనుండి బయటకు వచ్చారు, నీటిమీద నడుస్తూ యేసు వైపుకు నడవడం ఆరంభించాడు. అయితే కొంత దూరం నడచిన తరువాత, పేతురు తన చూపును యేసు నుండి మరల్చి అలలను చూడడం ఆరంభించాడు. బలమైన గాలులను చూచాడు.
అప్పుడు పేతురు భయపడ్డాడు, నీటిలోనికి మునిగి పోవడం ఆరంభించాడు. “ప్రభూ నన్ను రక్షించు” అని బిగ్గరగా అరవడం ప్రారంభించాడు. యేసు తన చేతిని చాపి పేతురు చేతిని పట్టుకొని పైకి లేపాడు. యేసు పేతురుతో ఇలా అన్నాడు, “నీకు కొంచెం విశ్వాసం ఉంది! నేను నిన్ను భద్రంగా ఉంచగలనని ఎందుకు విశ్వసించ లేదు?”
అప్పుడు పెతురు, యేసు పడవలోనికి వచ్చారు. వెంటనే గాలి వీయడం నిలిచిపోయింది. నీరు సద్దుమణిగింది. ఆయనను చూచి శిష్యులు ఆశ్చర్యపోయారు. ఆయనకు మ్రొక్కారు. ఆయనను ఆరాధించి ఆయనతో ఇలా అన్నారు, “నిజముగా నీవు దేవుని కుమారుడవు.”