unfoldingWord 49 - దేవుని నూతన నిబంధన
เค้าโครง: Genesis 3; Matthew 13-14; Mark 10:17-31; Luke 2; 10:25-37; 15; John 3:16; Romans 3:21-26, 5:1-11; 2 Corinthians 5:17-21; Colossians 1:13-14; 1 John 1:5-10
รหัสบทความ: 1249
ภาษา: Telugu
ผู้ฟัง: General
เป้าหมายของสื่อบันทึกเสียง: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
สถานะ: Approved
บทความเป็นแนวทางพื้นฐานสำหรับการแปลและบันทึกเสียงภาษาอื่นๆ ควรดัดแปลงตามความจำเป็นเพื่อให้เข้าใจและเหมาะสมกับวัฒนธรรมและภาษาแต่ละภาษา คำศัพท์และแนวคิดบางคำที่ใช้อาจต้องอธิบายเพิ่มเติม หรือแทนที่ หรือตัดออก
เนื้อหาบทความ
దేవుని దూత మరియ అనే కన్యకతో ఆమె దేవుని కుమారునికి జన్మనిస్తుందని చెప్పాడు. ఆమె ఇంకా కన్యకగానే ఉంది. అయితే పరిశుద్ధాత్ముడు ఆమెను కమ్ముకొంటాడు, ఆమె గర్భం ధరించేలా చేస్తాడు. ఆమె ఒక కుమారుడిని కనింది. ఆ బిడ్డకు యేసు అను పేరు పెట్టారు. కానుక యేసు దేవుడూ, మానవుడూ కూడా.
తాను దేవుడనని చూపించడానికి యేసు అనేక సూచకక్రియలు చేసాడు. ఆయన నీటి మీద నడిచాడు, తుఫానులు ఆపాడు. రోగులనేకులను ఆయన బాగు చేసాడు, అనేకులలో ఉన్న దయ్యాలను పారదోలాడు. చనిపోయిన వారిని తిరిగి లేపాడు. ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలను 5,000 మంది ప్రజలకు సరిపడే ఆహారంగా మార్చాడు.
ప్రభువైన యేసు ఒక గొప్పనాయకుడు కూడా. ఆయన బోధించినదంతా సరియైనదే. ఆయన దేవుని కుమారుడు కనుక ఆయన చెప్పిన దానిని ప్రజలు చెయ్యాలి. ఉదాహరణకు, నిన్ను నీవు ఏవిధంగా ప్రేమించుకొంటున్నావా అదే విధంగా పొరుగువారిని ప్రేమించాలి అని ఆయన చెప్పాడు.
అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలని కూడా ఆయన బోధించాడు.
ఈ లోకంలో ఉన్నవాటన్నిటినీ సంపాదించుకోవడం కంటే దేవుని రాజ్యంలో ఉండడం శ్రేష్ఠమైన సంగతి అని యేసు చెప్పాడు, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే దేవుడి నీ పాపాలను క్షమించాలి.
కొందరు యేసును అంగీకరిస్తారని యేసు చెప్పాడు. దేవుడు వీరిని క్షమిస్తాడు. అయితే కొందరు ఆయనను అంగీకరించరు. కొందరు మంచి నేలలా ఉంటారని యేసు చెప్పాడు. ఎందుకంటే యేసును గురించిన సువార్త వారు అంగీకరిస్తారు, దేవుడు వారిని రక్షిస్తాడు. దేవుని వాక్యం ఒక త్రోవలో పడిన విత్తనం లాంటిది. అయితే అక్కడ ఏమీ మొలవదు. ప్రజలు యేసును గురించిన సువార్తను తృణీకరిస్తారు. ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి నిరాకరిస్తున్నారు.
దేవుడు పాపులను ప్రేమిస్తున్నాడని యేసు బోధిస్తున్నాడు. ఆయన వారిని క్షమించడానికి కోరుతున్నాడు. వారిని ఆయన కుమారులుగా చేసుకోడానికి ఇష్టపడుతున్నాడు.
దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నాడని కూడా యేసు చెప్పాడు. ఆదాము, హవ్వ పాపం చేసారు కనుక వారి సంతానం యావత్తూ కూడా పాపం చేసింది. ఈ లోకంలో ఉన్న ప్రతీ వ్యక్తీ పాపం చేసినవాడే. దేవునికి దూరంగా ఉన్నారు. ప్రతీ ఒక్కరూ దేవునికి శత్రువులుగా ఉన్నారు.
అయితే లోకంలో ఉన్నవారినందరినీ ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు, ఆయనయందు విశ్వాసముంచు ప్రతీవాడునూ నశింపక నిత్యజీవం పొందేలా ఆయనను ఈ లోకానికి అప్పగించాడు.
నీవు చనిపోవడానికి అర్హుడవు. ఎందుకంటే నీవు పాపం చేసావు. దేవుడు నీ విషయంలో కోపంగా ఉండడం సరియైనదే. దానికి బదులు ఆయన యేసు విషయంలో కోపాన్ని చూపించాడు. సిలువ మీద యేసును బలిగా అర్పించడం ద్వారా దేవుడు యేసును శిక్షించాడు.
ప్రభువైన యేసు ఎన్నడూ పాపం చెయ్యలేదు. అయితే దేవుడు ఆయనను శిక్షించేలా ఇష్టపడ్డాడు. మరణించడానికి ఆయన అంగీకరించాడు. ఈ విధంగా మన పాపాలూ, లోకంలో ఉన్న మనుష్యులందరి పాపాలు తీసివేయడానికి ఆయన సంపూర్ణమైన బలిఅర్పణగా ఉన్నాడు. ప్రభువైన యేసు తనను తాను దేవునికి అర్పించుకొన్నాడు. కనుక దేవుని ఏ పాపాన్నైనా క్షమించగలడు. భయంకర పాపాలు అయినా ఆయన క్షమించగలడు.
నీవు ఎంత మంచి కార్యాలు చేసినా దేవుడు నిన్ను క్షమించేలా చెయ్యవు. దేవునితో స్నేహితునిగా మారడానికి నువ్వు ఏమీ చెయ్యలేవు. దానికి బదులు ప్రభువైన యేసు దేవుని కుమారుడనీ, నీకు బదులుగా సిలువలో చనిపోయాడనీ, దేవుడాయనను మృతులలోనుండి తిరిగి లేపాడనీ నీవు విశ్వాసించినట్లయితే దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు.
ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచి ఆయనను ప్రభువుగా అంగీకరించిన వారిని దేవుడు రక్షిస్తాడు. ఆయన యందు విశ్వాసముంచని వారిని దేవుడు క్షమించడు. నీవు ధనవంతుడవైనా, పేదవాడివి అయినా, పురుషుడు లేక స్త్రీ అయినా, ముసలి వాడవు లేక యవనస్థుడవైనా, ఎక్కడ నివసిస్తున్నా వ్యత్యాసం లేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు యేసు నందు విశ్వాసముంచాలని ఆయన కోరుతున్నాడు. ఆయన నీ స్నేహితుడు కావాలని ఆయన కోరుతున్నాడు.
నీవు ఆయన యందు విశ్వాసముంచి, బాప్తిస్మం పొందాలని యేసు నిన్ను పిలుస్తున్నాడు. ప్రభువైన యేసు మెస్సీయ అని నీవు విశ్వసిస్తున్నావా? ఆయనే దేవుని ఏకైక కుమారుడని నమ్ముతున్నావా? నీవు పాపి అనీ దేవుని శిక్షకు పాత్రుడవనీ నమ్ముతున్నావా? నీ పాపాలు తీసివేయడానికి యేసు సిలువలో చనిపోయాడని నీవు విశ్వసిస్తున్నావా?
యేసు నీ కోసం చేసినదానిని నీవు విశ్వసించినట్లయితే నీవు క్రైస్తవుడవు! సాతాను తన చీకటి రాజ్యంలో నీ మీద పాలన చెయ్యడు. ఆయన వెలుగు రాజ్యంలో నీ మీద ఆయన ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు. మీరింతకుముందు చేస్తున్న పాపం చెయ్యకుండా దేవుడు నిన్ను ఆపాడు. నీకు ఒక నూతనమైన సరియైన జీవన విధానాన్ని ఆయన నీకు అనుగ్రహించాడు.
నీవు క్రైస్తవుడైతే దేవుడు నీ పాపాలను క్షమించాడు, ఎందుకంటే ప్రభువైన యేసు చేసిన కార్యాన్ని బట్టి ఆయన నిన్ను క్షమించాడు. ఇప్పుడు దేవుడు నిన్ను తన శత్రువులా కాదు స్నేహితునిగా యెంచుతాడు.
నీవు దేవుని స్నేహితుడవూ, ప్రభువైన యేసు సేవకుడిగా ఉన్నట్లయితే యేసు నీకు బోధించినదానికి నీవు విధేయత చూపించడానికి ఇష్టపడతావు. నీవు క్రైస్తవ విశ్వాసివి అయినప్పటికీ నీవు పాపం చేసేలా సాతాను నిన్ను సాధిస్తాడు. అయితే దేవుడు దేనిని చేస్తానని చెపుతాడో దానినే చేస్తాడు. నీవు నీ పాపాలను ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను క్షమిస్తానని ఆయన చెపుతున్నాడు. పాపానికి వ్యతిరేకంగా పోరాడడానికి శక్తిని ఇస్తాడు.
దేవుని వాక్యాన్ని అధ్యయనం చెయ్యాలనీ, ప్రార్థన చెయ్యాలనీ దేవుడు చెపుతున్నాడు. ఇతర క్రైస్తవ విశ్వాసులతో కలిసి మీరు దేవున్ని ఆరాధించాలని ఆయన చెప్పాడు. ప్రభువైన యేసు నీకు చేసిన దానిని ఇతరులతో పంచుకోవాలి అని ప్రభువు నీకు చెపుతున్నాడు. ఈ కార్యాలన్నిటినీ చేస్తే నీవు ఆయనకు బలమైన స్నేహితుడవు అవుతావు.