unfoldingWord 10 - పది తెగుళ్ళు

概要: Exodus 5-10
文本編號: 1210
語言: Telugu
聽眾: General
目的: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
狀態: Approved
腳本是翻譯和錄製成其他語言的基本指南,它們需要根據實際需要而進行調整以適合不同的文化和語言。某些使用術語和概念可能需要有更多的解釋,甚至要完全更換或省略。
文本文字

ఫరో కఠినంగా ఉంటాడని మోషే ఆహారోనులకు దేవుడు ముందుగానే హెచ్చరించాడు. వారు ఫరో వద్దకు వెళ్ళినప్పుడు ఫరోతో ఇలా చెప్పారు, “ఇస్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు: నా ప్రజలు ఎడారిలో నాకు మహోత్సవం చేసేందుకు వారిని వెళ్ళనియ్యి.” అయితే ఫరో వారి మాటలు వినలేదు. ఇశ్రాయేలీయులను స్వతంత్రులను చెయ్యడానికి బదులు మరింత కఠినంగా పనిచెయ్యడానికి బలవంతపెట్టాడు.

ఇశ్రాయేలు ప్రజలను విడుదల చెయ్యడానికి ఫరో నిరాకరిస్తూ ఉన్నాడు. అందుచేత దేవుడు భయంకరమైన పది తెగుళ్ళను వారి మీదకు పంపించాడు. ఈ తెగుళ్ళ ద్వారా దేవుడు తాను ఫరో కంటే, ఐగుప్తు దేవుళ్ళందరి కంటే అధికుడినని కనుపరచుకొన్నాడు

దేవుడు నైలు నదిని రక్తంగా మార్చాడు, అయినా ఫరో ఇశ్రాయేలీయులను విడిచిపెట్టలేదు.

దేవుడు ఐగుప్తు మీదకు కప్పలను పంపించాడు. కప్పలను తొలగించాలని ఫరో మోషేను బతిమాలాడు. కప్పలు చనిపోయిన తరువాత ఫరో తన హృదయాన్ని కఠినపరచుకొన్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టలేదు.

అందుచేత దేవుడు దోమల వల్లనైన తెగులును పంపించాడు. తరువాత దేవుడు ఈగలను తెగులుగా పంపించాడు. ఫరో మోషే ఆహారోనుల కోసం కబురు పంపించాడు, ఈ తెగులును నిలుపు చేసిన యెడల ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్ట వచ్చునని చెప్పాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఐగుప్తునుండి సమస్త ఈగలను తొలగించాడు. అయితే ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకొన్నాడు. ప్రజలను విడిచి పెట్టడానికి నిరాకరించాడు.

తరువాత ఐగుప్తీయులకు చెందిన జంతువులన్నింటినీ చనిపోయేలా చేసాడు. అయినా ఫరో హృదయం కఠినం అయ్యింది, ఇశ్రాయేలీయులను విడిచిపోనివ్వలేదు.

అప్పుడు దేవుడు మోషే అహరోనులతో “మీరు కొలిమిలోనుంచి పిడికిళ్ళ బూడిద తీసుకొని ఫరో చూస్తుండగానే మోషే దాన్ని ఆకాశంవైపు విసిరివెయ్యాలి. బూడిద ఈజిప్ట్ దేశమంతటిమీద సన్నని దుమ్ము అవుతుంది: అది ఐగుప్టు దేశంలో అంతటా మనుషులమీదా జంతువులమీదా చీము పట్టే కురుపులవుతుంది” అన్నాడు. దేవుడు చెప్పిన విధంగా మోషే చేసినప్పుడు అది మనుషులమీదా జంతువులమీదా చీము పట్టే కురుపులయింది. అయితే ఫరో గుండె బండబారిపోయేలా యెహోవా చేశాడు. యెహోవా మోషేతో చెప్పిన ప్రకారమే అతడు వారి మాటను నిర్లక్ష్యం చేశాడు.

దాని తరువాత దేవుడు బాధకరమైన వడగండ్లను కురిపించాడు, ఆ వడగండ్లు ఐగుప్తు అంతటా వెలుపల ఉండేదాన్నంతా జంతువులనూ మనుషులనూ పొలాల్లో మొక్కలనూ పడగొట్టాయి. ప్రతి చెట్టూ కూడా విరిగిపోయింది. అప్పుడు ఫరో మోషేనూ అహరోన్నూ పిలిపించి వారితో “ఈ సారి నేను తప్పిదం చేశాను. యెహోవా న్యాయవంతుడు, నేనూ నాప్రజా దోషులం.✝ దేవుడు పంపిన ఈ ఉరుములూ వడగండ్లూ ఇక చాలు, వాటిని ఆపమని యెహోవాను వేడుకోండి . నేను మిమ్మల్ని వెళ్ళనిస్తాను. ఇకనుంచి మిమ్మల్ని నిలుపను” అన్నాడు. మోషే ప్రార్థన చేసాడు, వడగండ్లు ఆకాశం నుండి నిలిచిపోయాయి.

అయితే ఫరో మరల పాపం చేసాడు, తన హృదయాన్ని కఠినం చేసుకొన్నాడు. ఇశ్రాయేలీయులను పోనివ్వలేదు.

అప్పుడు దేవుడు ఐగుప్తు దేశం అంతటిమీద గాలిలో ఎగిరే మిడతలను రప్పించాడు. అవి దేశాన్నంతా కమ్మాయి; దేశం చీకటిగా అయిపోయింది. వడగండ్ల వల్ల నాశనం గాక పొలాల్లో మిగిలిన ప్రతి మొక్కనూ చెట్ల పండ్లన్నిటినీ తినివేశాయి.

తరువాత దేవుడు దట్టమైన చీకటిని పంపాడు, అది ఆ దేశం అంతా మూడు రోజులు ఉంది. ఆ మూడు రోజుల్లో ఒకరినొకరు చూడలేకపోయారు. ఎవ్వరూ తానున్న స్థలంనుంచి లేవలేకపోయారు. అయితే ఇస్రాయేల్ ప్రజ నివసించే స్థలాల్లో వెలుగు ఉంది.

తొమ్మిది తెగుళ్ళు అయిన తరువాత కూడా ఇశ్రాయేలీయులను విడిచిపెట్టడానికి నిరాకరించాడు. ఫరో దేవుని మాటను వినని కారణంగా ఫరో మనసు మారునట్లు దేవుడు చివరి తెగులును పంపించడానికి ప్రణాళిక చేసాడు.