unfoldingWord 35 - కరుణగల తండ్రి కథ

概要: Luke 15
文本編號: 1235
語言: Telugu
聽眾: General
目的: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
狀態: Approved
腳本是翻譯和錄製成其他語言的基本指南,它們需要根據實際需要而進行調整以適合不同的文化和語言。某些使用術語和概念可能需要有更多的解釋,甚至要完全更換或省略。
文本文字

ఒక రోజున యేసు అనేకమందికి బోధిస్తున్నాడు, వారు ఆయన చుట్టూ చేరారు. వీరు సుంకం వసూలు చేసేవారు, మోషే ధర్మశాస్త్రానికి లోబడని వారు.

ఈ ప్రజలతో ఆయన తన స్నేహితులుగా మాట్లాడుతూ ఉండడం కొందరు మత నాయకు చూసారు కనుక ఆయన తప్పిదం చేస్తున్నాడని ఒకరితో ఒకరు చెప్పుకొంటున్నారు వారు మాట్లాడుకొంటున్నదాన్ని యేసు విన్నాడు కనుక ఆయన వారితో ఈ కథ చెప్పాడు.

“ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు తన తండ్రితో, “తండ్రీ, నాకు ఇప్పుడే ఆస్తిలో నా స్వాస్థ్యం నాకు కావాలి!” కనుక తండ్రి తన ఆస్తిని ఆ ఇద్దరి కుమారుల మధ్య పంచి ఇచ్చాడు.”

“వెంటనే చిన్న కుమారుడు తనకున్నదానంతటినీ పోగు చేసుకొని దూర దేశం వెళ్లి పాప జీవితంలో తన ధనాన్ని వృధా చేసాడు.”

“అది జరిగిన తరువాత చిన్న కుమారుడు ఉన్న దేశంలో కరువు వచ్చింది, ఆహారం కొనడానికి అతని వద్ద డబ్బు లేదు. కనుక తనకు దొరికిన చిన్న ఉద్యోగాన్ని తీసుకొన్నాడు, అది పందులను మేపడం. తాను చాలా ఆకలితోనూ విచారకరమైన పరిస్థితిలో ఉన్నాడు, పందుల పొట్టును సహితం తినాలని ఆశ పడ్డాడు.”

“చివరకు, చిన్న కుమారుడు తనలో తాను ఇలా చెప్పుకొన్నాడు, ‘నేను చేస్తున్నదేమిటి? నా తండ్రి వద్ద ఉన్న సేవకులందరికి తినడానికి సమృద్ధిగా ఉంది, అయితే నేను ఆహారం లేక క్షీణిస్తున్నాను, నేను నా తండ్రి వద్దకు తిరిగి వెళ్తాను, ఆయన సేవకులలో ఒకనిగా చేర్చుకోనివ్వమని ఆయన బతిమాలతాను.”

“కనుక చిన్న కుమారుడు తన తండ్రి ఇంటికి ప్రయాణం అయ్యాడు. అతడు ఇంకా చాలా దూరంగా ఉండగానే, అతని తండ్రి కుమారుని చూచాడు, అతని పట్ల కరుణ కలిగింది. తన కుమారుని వద్దకు పరుగెత్తి వెళ్ళాడు, అతనిని కౌగలించుకొన్నాడు, ముద్దు పెట్టాడు.”

“కుమారుడు తన తండ్రితో ఇలా చెప్పాడు, ‘తండ్రీ దేవుని యెదుటనూ, నీ యెదుటనూ నేను పాపం చేసాను. నీ కుమారుడనని అనిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను.”

“అయితే తండ్రి తన సేవకులను పిలిచి, ‘త్వరగా వెళ్ళండి, శ్రేష్ఠమైన వస్త్రాలు తీసుకొని రండి, నా కుమారునికి వాటిని ధరింపచెయ్యండి! అతని వేలుకు ఉంగరాన్ని ధరింపజెయ్యండి, పాదాలకు చెప్పులను తొడగండి. శ్రేష్ఠమైన గొర్రెపిల్లను వధించండి, మనం వేడుక చేసుకొందాం, ఎందుకంటే చనిపోయిన నా కుమారుడు సజీవుడయ్యాడు, నశించిన వాడు, ఇప్పుడు మనం అతనిని కనుగొన్నాం!”

“కనుక ప్రజలు సంతోషించడం ఆరంభించారు. ఆ సమయంలో పెద్ద కుమారుడు పొలం నుండి ఇంటికి వచ్చాడు, ఇంటిలో సంగీతం, నాట్యం చూసాడు, జరుగుతున్న దానిని బట్టి ఆశ్చర్యపోయాడు.

“తన సోదరుడు ఇంటికి వచ్చిన కారణంగా జరుగుతున్న వేడుకను చూచినప్పుడు అతడు చాలా కోపగించుకొన్నాడు. ఇంటిలోనికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అతని తండ్రి వెలుపలికి వచ్చి లోనికి రమ్మని, వేడుకలో పాల్గొనమని అతనిని బతిమాలాడు, అయితే అతడు దానికి ఒప్పుకొనలేదు.”

“పెద్ద కుమారుడు తన తండ్రితో ఇలా అన్నాడు, “అనేక సంవత్సరాలు నీ కోసం నమ్మకంగా పని చేసాను! నేను ఎన్నడూ నీకు అవిధేయత చూపించలేదు, అయినా నీవు నా స్నేహితులతో ఆనందించడానికి నాకు ఎప్పుడూ ఒక చిన్న గొర్రెపిల్లనైనా ఇవ్వలేదు, అయితే నీ ఆస్తి అంతయూ వృధాగా వెచ్చించిన ఈ నీ చిన్నకుమారుడు వచ్చినప్పడు అతని కోసం నీవు వేడుక కోసం శ్రేష్ఠమైన గొర్రెను వధించావు!”

“తండ్రి ఇలా జవాబిచ్చాడు, ‘నా కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో ఉన్నావు, నాకున్న సమస్తమూ నీదే, అయితే మనం ఆనందించడం సరియైనదే ఎందుకంటే నీ సోదరుడు చనిపోయాడు, ఇప్పుడు బ్రతికాడు, తప్పిపోయాడు , ఇప్పుడు దొరికాడు!”