unfoldingWord 12 - నిర్గమనం

概要: Exodus 12:33-15:21
文本編號: 1212
語言: Telugu
聽眾: General
目的: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
狀態: Approved
腳本是翻譯和錄製成其他語言的基本指南,它們需要根據實際需要而進行調整以適合不同的文化和語言。某些使用術語和概念可能需要有更多的解釋,甚至要完全更換或省略。
文本文字

ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశాన్ని సంతోషంగా విడిచి పెట్టారు. వారిక మీదట బానిసలు కాదు. వారు వాగ్దాన దేశానికి వెళ్తున్నారు. అంతకుముందు ఇస్రాయేలు ప్రజలు మోషే మాట ప్రకారం చేసి ఐగుప్తు వాళ్ళ దగ్గర వెండి బంగారు నగలనూ వస్త్రాలనూ అడిగి తీసుకొన్నారు. ఐగుప్తువాళ్ళు ఇస్రాయేల్ ప్రజలను దయచూచేలా యెహోవా చేశాడు గనుక వారేమేమి కోరారో వాటిని వారికిచ్చారు. ఇతర దేశాల ప్రజలు దేవుణ్ణి విశ్వసించారు, వారు ఇశ్రాయేలీయులతో పాటు వెళ్ళారు.

పగటివేళ వారికి వెళ్ళవలసిన దారి చూపడానికీ రాత్రివేళ వెలుగు ఇవ్వడానికీ వారికి ముందుగా యెహోవా వెళ్ళాడు. పగటి వేళ స్తంభంలాంటి మేఘంలో, రాత్రివేళ స్తంభంలాంటి అగ్నిలో వెళ్ళాడు. ఈ విధంగా వారు పగలూ రాత్రీ ప్రయాణం .చేయగలిగారు. అన్ని సమయాలలో దేవుడు వారితో ఉన్నాడు, వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారిని నడిపించాడు. వారు చెయ్యవలసినదంతా దేవుణ్ణి అనుసరించడమే.

కొంత కాలం అయిన తరువాత ప్రజలు పారిపొయ్యారని ఐగుప్తు చక్రవర్తికి తెలియవచ్చినప్పుడు అతడూ అతడి పరివారమూ వారిని గురించి మనసు మార్చుకొన్నారు. వారు ఇశ్రాయేలీయులను తిరిగి తమ బానిసలుగా చేసుకోవాలని కోరుకున్నారు. కనుక అతడు తన రథాన్ని సిద్ధం చేయించుకొని తన జనాన్ని వెంటబెట్టుకొని బయలుదేరాడు. ఐగుప్తు చక్రవర్తి ఫరో గుండె బండబారిపోయేలా యెహోవా చేశాడు గనుక అతడు ఇస్రాయేల్ ప్రజను తరిమాడు. యెహోవా దేవుడు ఫరో కంటెనూ, ఐగుప్తులో ఉన్న దేవుళ్ళకంటెనూ శక్తిగలవాడు..

ఫరో వారిదగ్గరకు వచ్చినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఫరో సైన్యానికి, ఎర్రసముద్రానికి మధ్య చిక్కుకుపోయామని గుర్తించారు. ఇస్రాయేల్‌ప్రజలు చాలా భయంతో యెహోవాకు ఆక్రందన చేశారు. వారు మోషేతో ఇలా అన్నారు, “ఐగుప్తులో సమాధులు లేవని ఈ ఎడారిలో మేము చచ్చిపోవాలని మమ్మల్ని ఇక్కడికి తెచ్చారా?వచ్చారు.

అందుకు మోషే “భయపడకండి! దేవుడు మీకోసం యుధ్ధం చేస్తాడు.” అప్పుడు దేవుడు మోషేతో ‘ముందుకు సాగిపోండి’ అని ఇస్రాయేలు ప్రజలతో చెప్పు.

అప్పుడు దేవుడు మేఘస్తంభాన్ని ముందుకు కదిపాడు, ఐగుప్తీయులకూ, ఇశ్రాయేలీయులకు మధ్య దానిని నిలిపాడు. కనుక ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను చూడలేక పోయారు.

దేవుడు మోషేను తన చేతికర్రను ఎత్తి తన చెయ్యి సముద్రంమీద చాపమన్నాడు. దేవుడు బలమైన తూర్పు గాలి రాత్రంతా వీచేలా చేసి సముద్రాన్ని తొలగించి దాన్ని ఆరిన నేలగా చేశాడు.

ఇస్రాయేల్ ప్రజలు సముద్రం మధ్య ఆరిన నేలమీద నడుస్తూ వెళ్ళారు. వారి కుడిప్రక్కకూ ఎడమప్రక్కకూ నీళ్ళు గోడల్లాగా నిలిచాయి

అప్పుడు దేవుడు మేఘ స్తంభాన్ని ఇశ్రాయేలు ప్రజల మీద నుండి తొలగించాడు తద్వారా వారు పారిపోతున్నట్టు ఐగుప్తు ప్రజలు చూసారు. వారిని తరిమి సంహరించాలని ఐగుప్తు ప్రజలు నిశ్చయించారు.

ఐగుప్తు వారూ, ఫరో గుర్రాలూ రథాలూ రౌతులంతా వారిని తరుముతూ సముద్రంలోకి వెళ్ళారు. ఐగుప్తు వాళ్ళ సైన్యాన్ని భయపడేలా చేసి వాళ్ళ రథచక్రాలు ఊడిపడేలా చేశాడు. అందుచేత వారు “దేవుడు ఇస్రాయేలు ప్రజ పక్షాన యుద్ధం చేస్తున్నాడు! వాళ్ళ దగ్గరనుంచి పారిపోదాం!” అని చెప్పుకొన్నారు.

ఇశ్రాయేలు ప్రజలు సముద్రానికి ఆవలి వైపుకు చేరిన తరువాత, దేవుడు మోషేతో అన్నాడు, “నీ చెయ్యి సముద్రం మీద చాపు. మోషే చెయ్యి సముద్రం మీద చెయ్యి చాపగానే .ీళ్ళు మళ్ళీ ఫరో సైన్యమంతటినీ ముంచి కప్పివేశాయి.

సముద్రతీరాన పడివున్న ఐగుప్తు వాళ్ళ శవాలను ఇస్రాయేల్‌ప్రజలు చూశారు. ఇస్రాయేలు ప్రజకు యెహోవా మీద భయభక్తులు కలిగాయి. వారు దేవుని మీదా ఆయన సేవకుడైన మోషేమీదా నమ్మకం ఉంచారు.

ఇశ్రాయేలు ప్రజలు కూడా చాలా సంతోషించారు, ఎందుకంటే మరణంనుండి దేవుడు వారికి కాపాడాడు, బానిసత్వం నుండీ వారిని కాపాడాడు. ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికీ, విధేయత చూపించడానికీ వారు స్వతంత్రులయ్యారు. వారికి దొరకిన నూతన స్వేచ్చను బట్టి వారు అనేక కీర్తనలు పాడారు. ఐగుప్తు సైన్యం నుండి తమను కాపాడినందుకు వారు దేవునికి స్తుతి కీర్తనలు పాడారు.

దేవుడు ఐగుప్తీయులను ఓడించి ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వంనుండి ఏవిధంగా విడిపించాడో జ్ఞాపకం చేసుకోడానికి ప్రతీ సంవత్సరం వారు వేడుక చేసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ పండుగను పస్కాపండుగ అని పిలిచారు. ఆ పండుగలో వారు ఒక ఆరోగ్యవంతమైన గొర్రెపిల్లను వధిస్తారు, దానిని కాల్చుతారు, దానిని పులియని రొట్టెలతో భుజిస్తారు.