unfoldingWord 42 - యేసు పరలోకానికి ఆరోహణం కావడం
Uhlaka: Matthew 28:16-20; Mark 16:12-20; Luke 24:13-53; John 20:19-23; Acts 1:1-11
Inombolo Yeskripthi: 1242
Ulimi: Telugu
Izilaleli: General
Inhloso: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
Isimo: Approved
Imibhalo ayiziqondiso eziyisisekelo zokuhunyushwa nokuqoshwa kwezinye izilimi. Kufanele zishintshwe njengoba kunesidingo ukuze ziqondakale futhi zihambisane nesiko nolimi oluhlukene. Amanye amagama nemiqondo esetshenzisiwe ingase idinge incazelo eyengeziwe noma ishintshwe noma ikhishwe ngokuphelele.
Umbhalo Weskripthi
దేవుడు యేసును మృతులలో నుండి లేపిన దినాన్న ఆయన శిష్యులలో ఇద్దరు మార్గమధ్యలో తమ ఊరికి వెళ్తున్నారు. వారు నడుస్తున్నప్పుడు యేసుకు జరిగిన దానిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. యేసే మెస్సీయ అని వారు తలంచారు. అయితే ఆయనను చంపివేశారు. ఇప్పుడు కొందరు స్త్రీలు ఆయనను లేచాడని చెపుతున్నారు. దేనిని వారు నమ్మాలో వారికి తెలియదు.
యేసు వారిని కలుసుకున్నాడు. వారితో కలిసి నడవడం ఆరంభించాడు. అయితే వారు ఆయనను గుర్తు పట్టలేదు. వారు దేనిని గురించి మాట్లాడుతున్నారు అని ఆయన వారిని అడిగాడు. గత కొద్ది రోజులుగా యేసుకు జరుగుతున్న దానిని గురించి మాట్లాడుతున్నట్టుగా వారు ఆయనతో చెప్పారు. యెరూషలెంలో జరుగుతున్న వాటిని గురించి తెలియని ఒక విదేశీయునితో వారు మాట్లాడుతున్నట్టు వారు తలంచారు.
మెస్సీయను గురించి దేవుని వాక్యం చెపుతున్న దానిని యేసు వారికి వివరించాడు. దుష్టులైన మానవులు మెస్సీయను శ్రమపెడతారనీ, ఆయనను చంపివేస్తారని చాలా కాలం క్రితం ప్రవక్తలు చెప్పారు. అయితే యేసు మూడవ రోజున తిరిగి సజీవుడుగా లేస్తాడనీ ప్రవక్తలు పలికారు.
వారు పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు వారిద్దరూ అక్కడ నిలిచి యుండాలని కోరారు. దాదాపు పొద్దుపోయిన సమయం. వారితో ఉండాలని యేసును వారు బలవంతం చేసారు. కనుక యేసు వారితో పాటు ఇంటిలోనికి వెళ్ళాడు. సాయంకాల భోజనం చెయ్యడానికి వారు కూర్చున్నప్పుడు యేసు ఒక రొట్టెను పట్టుకొని దేవునికి కృతజ్ఞత చెల్లించి దానిని విరిచాడు, వెంటనే ఆయన యేసు అని వారు గుర్తుపట్టారు. అయితే ఆ క్షణంలో ఆయన వారి మధ్యనుండి అదృశ్యడయ్యాడు.
ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు ఇలా అనుకున్నారు, “ఆయన నిజముగా యేసు! ఆయన మనకు దేవుని వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు మన హృదయాలు సంతోషంతో ఉప్పొంగాయి!” వెంటనే వారు యెరూషలెంకు వారు వెళ్ళారు. వారు అక్కడికి చేరినప్పుడు “యేసు సజీవుడు! మేము ఆయనను కన్నులారా చూచాం!” అని వారితో చెప్పారు.
శిష్యులు మాట్లాడుకొంటుండగా, అకస్మాత్తుగా యేసు గదిలో వారి మధ్యకు ప్రత్యక్ష్యమయ్యాడు. “మీకు సమాధానం కలుగుతుంది గాక!” అని యేసు వారితో చెప్పాడు. ఆయన ఒక భూతం అని శిష్యులు తలంచారు. అయితే యేసు వారితో ఇలా చెప్పాడు, “మీరెందుకు భయపడుచున్నారు? నేను యేసును అని మీరెందుకు తలంచడం లేదు? నా చేతులు చూడండి, నా కాళ్ళను చూడండి. భూతాలకు నాకున్నట్టు దేహాలు ఉండవు.” ఆయన భూతం కాదని చూపించడానికి ఆయన తినడానికి ఆహారాన్ని అడిగాడు. వారు ఆయనకు ఒక చేప ముక్కను ఇచ్చారు. ఆయన దానిని భుజించాడు.
యేసు ఇలా చెప్పాడు, “నా గురించి దేవుని వాక్యం చెప్పిన ప్రతీది జరుగుతుంది. ఇది జరగవలసి యున్నదని నేను మీతో చెప్పాను.” దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థం అయ్యేలా చేసాడు. ఆయన ఇలా చెప్పాడు, “చాలా కాలం క్రితం నేను మెస్సీయను, అనేక శ్రమలు అనుభావిస్తాను, చనిపోయి మృతులలో నుండి తిరిగి లేస్తానని ప్రవక్తలు రాసారు,”
“నా శిష్యులు దేవుని సందేశాన్ని ప్రచురిస్తారని కూడా ప్రవక్తలు రాసారు. ప్రతిఒక్కరు పశ్చాత్తాపపడాలని చెపుతారు. వారు పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు వారి పాపాలను క్షమిస్తాడు. శిష్యుల ఈ సందేశాన్ని మొదట యెరూషలెంలో ప్రకటించడం ఆరంభిస్తారు. అన్ని ప్రాంతాలలోని ప్రతీ ప్రజాగుంపు వద్దకు వారు వెళ్తారు. నేను చెప్పిన, చేసిన ప్రతీ దానికీ, నాకు జరిగిన ప్రతీదానికీ మీరు నాకు సాక్ష్యులుగా ఉంటారు.
తరువాత నలుబది రోజులలో, అనేక మార్లు యేసు శిష్యులందరికీ కనిపించాడు. ఒకసారి, ఆయన 500 మంది ప్రజలకు కూడా కనిపించాడు. ఆయన సజీవుడిగా అనేక మార్లు తన శిష్యులకు రుజువు పరచుకొన్నాడు! దేవుని రాజ్యం గురించి వారికి బోధించాడు.
యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు, “పరలోకమందునూ, భూమిమీదనూ నాకు సర్వాదికారం ఇవ్వబడియున్నది. కనుక నేనే మీకిది చెపుతున్నాను: సమస్త దేశములకు వెళ్ళండి. సమస్త ప్రజలను శిష్యులనుగా చెయ్యండి. తండ్రి యొక్కయూ, కుమారుని యొక్కయూ, పరిశుద్ధాత్మ యొక్కయూ నామములోనికి బాప్తిస్మం ఇవ్వాలి. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించాలి, జ్ఞాపకం ఉంచుకోండి, సదాకాలం నేను మీతో ఉంటాను.”
మృతులలో నుండి తిరిగి లేచిన నలుబది రోజుల తరువాత ఆయన తన శిష్యులతో ఇలా చెప్పాడు, “నా తండ్రి శక్తిని అనుగ్రహించేవరకు మీరు యెరూషలెంలో నిలిచియుండండి. ఆయన మీ మీదకు పరిశుద్ధాత్మను పంపిస్తాడు.” అప్పుడు ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఒక మేఘం ఆయనను కమ్ముకొంది. ప్రభువైన యేసు పరలోకం తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమందు సమస్తాన్ని పరిపాలించదానికి కూర్చుండి యున్నాడు.