unfoldingWord 15 - వాగ్దాన దేశం
概要: Joshua 1-24
文本編號: 1215
語言: Telugu
聽眾: General
目的: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
狀態: Approved
腳本是翻譯和錄製成其他語言的基本指南,它們需要根據實際需要而進行調整以適合不同的文化和語言。某些使用術語和概念可能需要有更多的解釋,甚至要完全更換或省略。
文本文字
చివరకు ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశమైన కనానులోకి ప్రవేశించారు. ఆ దేశంలో యెరికో అని పిలువబడిన ఒక పట్టణం ఉంది. దానిని రక్షించడానికి దాని చుట్టూ బలమైన గోడలు ఉన్నాయి. ఆ పట్టణంలోనికి యెహోషువ ఇద్దరు వేగులవారిని పంపించాడు. ఆ పట్టణంలో రాహాబు అనే వ్యభిచారి ఉంది. ఆమె ఈ గూఢచారాలను దాచిపెట్టింది. తరువాత ఆమె వారిని నగరం నుండి తప్పించుకోవడానికి సహాయం చేసింది. ఆమె దేవుణ్ణి విశ్వసించింది. కాబట్టి ఆమె ఇలా చేసింది. ఇశ్రాయేలీయులు యెరికోను నాశనం చేసినప్పుడు రాహాబును, ఆమె కుటుంబాన్ని రక్షించాలని వారు వాగ్దానం చేసారు.
ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడానికి వారు యొర్దాను నదిని దాటవలసి వచ్చింది. దేవుడు యెహోషువతో ఇలా చెప్పాడు, "యాజకులు మొదట వెళ్ళాలి, ." డుఅడుగుపెట్టినప్పుయాజకులు , యొర్డాను నీళ్ళు ఎగువనుండి ఆగిపోయాయి, కనుక ఇశ్రాయేలీయులు పొడిగా ఉన్న ప్రదేశంలో నది యొక్క మరొక వైపుకు దాటగల్గారు.
ప్రజలు యొర్దాను నదిని దాటిన తర్వాత, దేవుడు యెరికో చాలా బలంగా ఉన్నప్పటికీ, దాని మీదకు దాడి చేయడానికి సిద్ధంగా ఉండాలని యెహోషువకు చెప్పాడు. ేయాజకులకూ, సైనికులకూ ఆరు రోజులు రోజుకు ఒకసారి చొప్పున నగరం చుట్టూ ప్రదక్షణ చెయ్యాలని చెప్పాడు. కనుక యాజకులూ, సైనికులూ దీనిని చేశారు.
ఏడవ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఆ నగరాన్ని చుట్టూ మరోసారి ప్రదక్షణ చేసారు, ఏడవ సారి వారు నగరాన్ని చుట్టుముట్టినప్పుడు యాజకులు వారి బూరలు ఊదారు, సైనికులు గట్టిగా అరిచారు.
అప్పుడు యెరికో చుట్టూ గోడలు దేవుడు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు పట్టణంలోని ప్రతిదానిని ధ్వంసం చేశారు. వారు ఇశ్రాయేలీయులలో భాగమైన రాహాబునూ, తన కుటుంబాన్ని మాత్రమే విడిచిపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు యెరికోను నాశనం చేశారని కనానులో నివసిస్తున్న ఇతర ప్రజలు విన్నప్పుడు, ఇశ్రాయేలీయులు వారి మీద కూడా దాడి చేస్తారని వారు భయపడ్డారు.
ఇశ్రాయేలీయులు కనానులోని ప్రజల సమూహాలతో శాంతి ఒప్పందం చేసుకోవద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. కానీ కనానీయుల సమూహాలలో ఒకటైన గిబియోనీయులు యెహోషువకు అబద్దం చెప్పారు, వారు కనాను నుండి చాలా దూరంలో ఉన్నట్లు చెప్పారు. వారితో శాంతి ఒప్పందం చేసుకోమని యెహోషువను అడిగారు., ఇశ్రాయేలీయుల ఇతర నాయకులు ఏమి చేయకూడదని చెప్పాడో డానికి వ్యతిరేకంగా , వారు గిబియోనీయులతో శాంతి ఒప్పందం చేశారు.
మూడు రోజుల తర్వాత, గిబియోనీయులు నిజంగా కనానులో నివసిస్తున్నారని ఇశ్రాయేలీయులు కనుగొన్నారు. గిబియోనీయులు వారిని మోసగించినందున వారు కోపంగా ఉన్నారు. అయితే వారు దేవుని యెదుట వాగ్దానం చేసినందువల్ల వారు తమతో చేసిన శాంతి ఒప్పందాన్ని వారు నెరవేర్చారు. కొంత కాలం తరువాత, గిబియోనీయులు ఇశ్రాయేలీయులతో ఒక శాంతి ఒప్పందం చేసుకున్నారని కనానులోని అమోరీయుల సమూహానికి చెందిన మరో ప్రజల రాజులు విన్నారు, కాబట్టి వారు తమ సైన్యాలను ఒక పెద్ద సైన్యంతో కలిపి గిబియోనుపై దాడి చేశారు. గిబియోనీయులు సహాయాన్ని కోరుతూ యెహోషువకు ఒక సందేశాన్ని పంపారు.
కనుక యెహోషువ ఇశ్రాయేలు సైన్యాన్ని సమకూర్చాడు, గిబియోనీయుల దగ్గరకు చేరడానికి వారు రాత్రిపూట అంతా ప్రయాణం చేసారు. ఉదయాన్నే వారు అమోరీయుల సైన్యాన్ని ఆశ్చర్యపరిచారు, వారి మీద దండెత్తారు.
ఆ రోజు ఇశ్రాయేలు కోసం దేవుడు పోరాడాడు. అయన అమోరీయులను గందరగోళానికి గురిచేశాడు. దేవుడు పెద్ద వడగళ్ళను పంపించాడు, అవి అమోరీయులనందరినీ చంపాయి.
ఇశ్రాయేలు అమోరీయులను పూర్తిగా ఓడించడంలో ఇశ్రాయేలీయులకు చాలినంత సమయము కలిగి ఉండడం కోసం సూర్యున్ని ఆకాశంలో ఒకే స్థలములో ఉండేలా దేవుడు చేసాడు. ఆ రోజున దేవుడు ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు.
దేవుడు ఆ సైన్యాలను ఓడించిన తరువాత, చాలామంది కనానీయుల ప్రజల గుంపులు ఇశ్రాయేలీయుల మీద దాడి చేయడానికి సమావేశం అయ్యారు. యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు వారి మీద దాడిచేసి నాశనం చేశారు.
ఈ యుద్ధాల తరువాత, దేవుడు ఇశ్రాయేలు ప్రతి గోత్రానికి వాగ్దాన భూమిలో వారి వారి వంతు ప్రకారం భాగాన్ని ఇచ్చాడు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకు తమ సరిహద్దులన్నిటిలో నెమ్మదిని ఇచ్చాడు.
యెహోషువ వృద్ధుడయినప్పుడు, ఇశ్రాయేలీయులనందరినీ ఒక చోట సమావేశం కావడానికి పిలిచాడు. అప్పుడు యెహోషువ దేవుడు సీనాయి పర్వతం వద్ద ఇశ్రాయేలీయులతో చేసిన ఒడంబడికకు వారు విధేయత చూపుతారని వాగ్దానం చేసినట్లు వారికి జ్ఞాపకం చేసాడు. ఇశ్రాయేలీయులందరూ దేవునికి నమ్మకంగా ఉండడానికీ, ఆయన నియమాలకు విధేయులుగా ఉంటామని వాగ్దానం చేశారు.