unfoldingWord 44 - పేతురు, యోహానులు కుంటి బిక్షకుని స్వస్థపరచడం

概要: Acts 3-4:22
文本編號: 1244
語言: Telugu
聽眾: General
目的: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
狀態: Approved
腳本是翻譯和錄製成其他語言的基本指南,它們需要根據實際需要而進行調整以適合不同的文化和語言。某些使用術語和概念可能需要有更多的解釋,甚至要完全更換或省略。
文本文字

ఒక రోజున పేతురు, యోహానులు దేవాలయానికి వెళ్ళారు. ఒక కుంటివాడు ద్వారం వద్ద కూర్చొని బిచ్చ మెత్తుతున్నాడు.

పేతురు ఆ కుంటి వానిని చూచి ఇలా అన్నాడు, “నీకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేవు. అయితే నాకున్న దానినే నీకిస్తున్నాను. యేసు క్రీస్తు నామంలో లేచి నడువు!

వెంటనే, దేవుడు ఆ కుంటివానిని స్వస్థపరచాడు. అతడు నడవడానికీ, గెంతడానికీ ఆరంభించాడు. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవాలయం ఆవరణంలో ఉన్నవారు ఆశ్చర్య పడ్డారు.

స్వస్థత పొందినవానిని చూడడానికి ప్రజల సమూహం అక్కడికి వచ్చింది. పేతురు వారితో ఇలా చెప్పాడు, “ఈ వ్యక్తి బాగయ్యాడు. దీని విషయంలో మీరు ఆశ్చర్య పోవద్దు. ఈ వ్యక్తిని మేము బాగు చెయ్యలేదు లేక మేము దేవుణ్ణి గొప్ప చేస్తున్నందుకు కాదు. ప్రభువైన యేసే ఆయన శక్తి చేత ఈ మనిషిని బాగు చేసాడు. మేము ఆయన యందు విశ్వాసముంచుతున్నాము.”

“ఈ యేసు చంపాలని రోమా గవర్నరుకు మీరే చెప్పారు. ప్రతిఒక్కరికి జీవాన్ని ఇచ్చే వానిని చంపింది మీరే. అయితే దేవుడాయనను మృతులలో నుండి లేపాడు. మీరు చేయుచున్న దానిని మీరు అర్థం చేసుకోవడం లేదు. అయితే మీరు ఈ కార్యాన్ని చేసినప్పుడు ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేరాయి. మెస్సీయ శ్రమల పాలవుతాడు, ఆయన చనిపోతాడని వారు చెప్పారు. ఈ విధంగా దేవుడు జరుగనిచ్చాడు. కాబట్టి ఇప్పుడే పశ్చాత్తాపపడండి, దేవుని వైపు తిరగండి ఆయన మీ పాపాలను శుద్ధి చేస్తాడు.

పేతురు, యోహానుల మాటలను బట్టి దేవాలయపు అధికారులు కలవరపడ్డారు. వారిని బంధించారు. వారిద్దరినీ చెరసాలలో వేశారు. అయితే పేతురు చెప్పిన దానిని అనేకులు విశ్వసించారు. ఆ దినం ప్రభువు నందు విశ్వసించిన పురుషుల సంఖ్య దాదాపు 5,000.

మరుసటి రోజు యూదా నాయకులు పేతురు, యోహానులను ప్రధాన యాజకుని వద్దకు, ఇతర నాయకుల వద్దకు పిలువనంపించారు. స్వస్థత పొందిన కుంటి వానిని కూడా పిలిచారు. వారు పేతురు, యోహానులను ఇలా అడిగారు, “ఈ ఏ శక్తి చేత ఈ కుంటివానిని మీరు బాగు చేసారు?”

పేతురు వారికి ఇలా జవాబిచ్చాడు, “మీ యెదుట నిలుచున్న ఈ మనుష్యుడు మెస్సీయ ప్రభువైన యేసు శక్తి చేత స్వస్థత పొందాడు. యేసును మీరు సిలువ వేశారు. అయితే దేవుడు ఆయనను సజీవుడిగా తిరిగి లేపాడు! మీరు ఆయనను నిరాకరించాడు, అయితే ప్రభువైన యేసు శక్తి ద్వారా తప్ప రక్షణ పొందడానికి మరే ఇతర నామం లేదు!”

పేతురు యోహానులు బహు ధైర్యంతో మాట్లాడడం చూచి నాయకులు నిర్ఘాంతపోయారు. అయితే వీరిద్దరూ యేసుతో కూడా ఉన్నవారని జ్ఞాపకం చేసుకొన్నారు. కనుక వారు శిష్యులతో ఇలా చెప్పారు, “యేసు అను ఈ మనుష్యుని గురించి ఇక మీద బోధించినట్లయితే మిమ్మును బహుగా శిక్షిస్తాం.” ఈ విధంగా అనేక సంగతులు బోధించిన తరువాత పేతురు, యోహానులు అక్కడి నుండి వెళ్ళిపోయారు.