unfoldingWord 14 - అరణ్యంలో తిరుగులాడడం
เค้าโครง: Exodus 16-17; Numbers 10-14; 20; 27; Deuteronomy 34
รหัสบทความ: 1214
ภาษา: Telugu
ผู้ฟัง: General
เป้าหมายของสื่อบันทึกเสียง: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
สถานะ: Approved
บทความเป็นแนวทางพื้นฐานสำหรับการแปลและบันทึกเสียงภาษาอื่นๆ ควรดัดแปลงตามความจำเป็นเพื่อให้เข้าใจและเหมาะสมกับวัฒนธรรมและภาษาแต่ละภาษา คำศัพท์และแนวคิดบางคำที่ใช้อาจต้องอธิบายเพิ่มเติม หรือแทนที่ หรือตัดออก
เนื้อหาบทความ
దేవుడు వారితో చేసిన నిబంధన కారణంగా ఇశ్రాయేలీయులు విధేయత చూపించేలా అన్ని శాసనాలను గురించి చెప్పడం ముగించాడు. ఆ తరువాత వారిని సీనాయి పర్వతం నుండి దూరంగా వారిని నడిపించాడు. వారిని వాగ్దాన భూమికి తీసుకొని వెళ్లాలని కోరాడు. ఈ భూమిని కనాను అని పిలిచారు. దేవుడు వారికి ముందుగా మేఘస్థంభం వలే నడిచాడు, ఇశ్రాయేలీయులు ఆయనను అనుసరించారు.
వారి సంతానానికి వాగ్దాన దేశాన్ని ఇస్తానని దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసాడు. అయితే అక్కడ అనేకమంది ప్రజలు నివసిస్తున్నారు. వారిని కనానీయులు అని అంటారు. కానానీయులు దేవుణ్ణి పూజించరు, ఆయనకు విధేయత చూపించరు. అబద్ధపు దేవుళ్ళను వారు పూజిస్తారు, అనేక దుష్ట కార్యాలు చేసారు.
దేవుడు ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు. “మీరు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించిన తరువాత అక్కడ నివసించే కానానీయలందరిని తొలగించి వెయ్యాలి. వారితో సమాధానపడకూడదు, వారితో వివాహాలు చేసుకోకూడదు. వారి విగ్రహాలన్నిటినీ పూర్తిగా నాశనం చెయ్యాలి. మీరు నాకు లోబడని యెడల నాకు బదులుగా వారి విగ్రహాలను పూజిస్తారు.”
ఇశ్రాయేలీయులు కనాను సరిహద్దులకు సమీపించినప్పుడు, మోషే పన్నెండు మంది పురుషులను ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాలనుండి ఎంపిక చేసాడు. వారు ఆ దేశాన్ని వేగు చూడడానికీ, ఆ దేశం ఏవిధంగా ఉందొ కనుగొనడానికి వారికి హెచ్చరికలు ఇచ్చాడు. కనానీయుల బలాలు, వారి బలహీనతలను గురించి వేగు చూడాలి.
ఆ వేగువారు కనాను దేశంలో నలుబది రోజులు ప్రయాణం చేసారు. తరువాత వారు తిరిగి వెనుకకు వచ్చారు. ఆ వేగువారు ప్రజలతో ఇలా చెప్పారు, “కనాను భూభాగం చాలా సారవంతమైన ప్రదేశం, పంటలు విస్తారంగా ఉన్నాయి!” అయితే వారిలో పదిమంది వేగువారు ఇలా చెప్పారు, “ఆ నగరాలు చాలా బలంగా ఉన్నారు, ప్రజలు బలవంతులు! వారి మీదకు మనం దండెత్తినట్లయితే వారు ఖచ్చితంగా మనలను ఓడిస్తారు, మనలను చంపివేస్తారు!”
వెంటనే ఇద్దరు వేగువారు, యెహోషువా, కాలేబులు వారితో ఇలా చెప్పారు, “కనాను వారు ఉన్నత దేహులు, బలవంతులు అను మాట వాస్తవమే, అయితే మనం వారిని జయించగలం! దేవుడు మనం పక్షంగా యుద్ధం చేస్తాడు!
అయితే ప్రజలు యెహోషువా, కాలేబులు చెప్పిన మాట వినలేదు. మోషే, ఆహారోను పట్ల వారు కోపగించుకొన్నారు, మోషేతో ఇలా అన్నారు, “ఈ భయంకరమైన ప్రదేశానికి మమ్ములను ఎందుకు తీసుకొనివచ్చావు? మేము ఐగుప్తులోనే ఉండవలసినది కదా! ఈ నూతన భూభాగంలోనికి మేము ప్రవేశించినప్పుడు మనం యుద్ధంలో చనిపోతాం, కనానీయులు మన భార్యలనూ, పిల్లలనూ వారి బానిసలుగా చేసుకొంటారు.” వారిని తిరిగి ఐగుప్తులోనికి నడిపించడానికి కొత్త నాయకుడిని ఎంపిక చేసుకోవాలని కోరారు.
ప్రజలు ఈ మాట చెప్పినప్పుడు దేవుడు చాలా కోపగించుకొన్నాడు. ఆయన ప్రత్యక్షపు గుడారం వద్దకు వచ్చాడు. ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాడు, “మీరు నా మీద తిరుగుబాటు చేసారు, మీరందరూ అరణ్యంలో తిరుగులాడాలని కోరుతున్నారు. మీలో ఇరువది సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు చనిపోతారు, నేను మీకిచ్చు వాగ్దానదేశంలో ఎన్నటికీ ప్రవేశించారు. కేవలం యెహోషువా, కాలేబులు మాత్రమే ప్రవేశిస్తారు.”
దేవుని మాట ప్రజలు వినినప్పుడు వారు పాపం చేసారని విచారపడ్డారు. కనుక వారు కనానీయుల మీద దాడి చెయ్యడానికి సిద్ధపడ్డారు. మోషే వారిని వెళ్ళవద్దని హెచ్చరించాడు, ఎందుకంటే దేవుడు వారితో ఉండడు, వారు ఆయన మాట వినలేదు.
ఈ యుద్ధంలో దేవుడు వారితో వెళ్ళలేదు, కనుక కనానీయులు వారిని ఓడించారు, అనేకులను చంపారు. అప్పుడు ఇశ్రాయేలీయులు కనాను నుండి తిరిగి వచ్చారు. తరువాత నలభై సంవత్సరాలు అరణ్యంలో వారు తిరుగులాడారు.
ఇశ్రాయేలీయులు అరణ్యంలో నలుబది సంవత్సరాలు తిరుగులాడినప్పుడు దేవుడు వారికి ఆహారాన్ని సమకూర్చాడు. పరలోకం నుండి వారికి ఆహారాన్ని కురిపించాడు, దానిని “మన్నా” అని పిలిచారు, దేవుడు వారికి పూరేల్లను కూడా (ఒక మాదిరి బరువుండే ఉన్న చిన్న పక్షులు) వారి శిబిరాలలో కురిపించాడు. వారు దాని మాంసాహారాన్ని తినాలని వాటిని అనుగ్రహించాడు. ఆ సమయం అంతటిలోనూ దేవుడు వారి దుస్తులూ, కాలి చెప్పులు తరిగిపోకుండా వారిని సంరక్షించాడు.
దేవుడు ఆశ్చర్యకరంగా బండలోనుండి నీటిని బయటికి తెప్పించాడు. అయితే ఇలా జరిగినప్పటికీ ఇశ్రాయేలీయులు పిర్యాదులు చేసారు, దేవునికీ, మోషేకూ వ్యతిరేకంగా సణిగారు. అయినా దేవుడు వారి పట్ల నమ్మదగినవాడిగా ఉన్నాడు. ఆయన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు తాను వాగ్దానం చేసినదానిని వారికి అనుగ్రహించాడు.
మరొకసారి ప్రజలకు తాగడానికి నీరు లేనప్పుడు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, “రాయితో మాట్లాడు, దానిలోనుండి నీరు బయటికి వస్తుంది.” అయితే మోషే ఆ రాయితో మాట్లాడలేదు, దానికి బదులు ఆ రాయిని రెండు సార్లు కొట్టాడు. ఈ విధంగా మోషే దేవుణ్ణి అగౌరపరచాడు. దేవుడు మోషే పట్ల కోపగించుకొన్నాడు. దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, “నీవు ఈ కార్యం చేసిన కారణంగా నీవు వాగ్దానదేశంలోనికి ప్రవేశించలేవు.”
ఇశ్రాయేలీయులు నలుబది సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాడిన తరువాత దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారందరూ చనిపోయారు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులను తిరిగి వాగ్దానదేశం వద్దకు తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు మోషే బహుకాలం గడచిన వృద్దుడయ్యాడు. కనుక దేవుడు యెహోషువాను ఎంపిక చేసాడు. మోషే లాంటి ప్రవక్తను మనుష్యుల వద్దకు పంపిస్తానని దేవుడు మోషేకు వాగ్దానం చేసాడు.
అప్పుడు దేవుడు మోషేను పర్వతం చివరి కొన వరకు వెళ్ళమని చెప్పి వాగ్దానదేశాన్ని చూపించాడు. మోషే వాగ్దాన దేశాన్ని చూసాడు, అయితే దాని లోనికి ప్రవేశించడానికి దేవుడు అనుమతించలేదు. అప్పుడు మోషే చనిపోయాడు, ఇశ్రాయేలీయులు ముప్ఫై రోజులు ఏడ్చారు. యెహోషువా నూతన నాయకుడు అయ్యాడు. యెహోషువా గొప్ప నాయకుడు ఎందుకంటే అతడు దేవుణ్ణి విశ్వసించాడు, విధేయత చూపించాడు.