unfoldingWord 32 - దయ్యము పట్టిన వ్యక్తిని, రోగియైన ఒక స్త్రీని యేసు బాగు చెయ్యడం
เค้าโครง: Matthew 8:28-34; 9:20-22; Mark 5; Luke 8:26-48
รหัสบทความ: 1232
ภาษา: Telugu
ผู้ฟัง: General
เป้าหมายของสื่อบันทึกเสียง: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
สถานะ: Approved
บทความเป็นแนวทางพื้นฐานสำหรับการแปลและบันทึกเสียงภาษาอื่นๆ ควรดัดแปลงตามความจำเป็นเพื่อให้เข้าใจและเหมาะสมกับวัฒนธรรมและภาษาแต่ละภาษา คำศัพท์และแนวคิดบางคำที่ใช้อาจต้องอธิบายเพิ่มเติม หรือแทนที่ หรือตัดออก
เนื้อหาบทความ
యేసూ, ఆయన శిష్యులూ గెరాసేనుల ప్రాంతానికి ఒక పడవలో ప్రయాణిస్తూ వెళ్ళారు. వారు ఆ ప్రాంతానికి వచ్చి పడవలోనుండి కిందకి దిగారు.
అక్కడ దయ్యములు పట్టిన ఒకడు ఉన్నాడు.
ఇతడు చాలా బలమైన వాడు, ఎవరునూ అతనిని సాధు చెయ్యలేకపోతున్నారు. కొన్నిసార్లు కొందరు గొలుసులతో అతని కాళ్ళను, చేతులను కట్టియుంచేవారు. అయితే అతడు వాటిని తుత్తునియులుగా చేస్తున్నాడు.
ఆ మనిషి ఆ ప్రాంతంలో ఉన్న సమాధులలో నివాసం చేస్తున్నాడు. రోజంతా గట్టిగా కేకలు వేస్తున్నాడు, సరియైన వస్త్రాలు ధరించలేదు, తరచూ రాళ్ళతో తనను తాను గాయపరచుకొంటూ ఉన్నాడు.
ఆ మనిషి యేసును చూసి ఆయన వద్దకు పరుగెత్తి వెళ్లి ఆయన యెదుట సాగిలపడ్డాడు. యేసు అతనిలోని దయ్యాలతో, “ఈ మనిషిలోనుండి బయటకు రమ్ము” అని చెప్పాడు.
వాడిలోని దయ్యాలు గట్టిగా అరిచాయి, “సర్వోన్నతుని దేవుని కుమారుడవైన యేసూ, మాతో నీకేమి? నన్ను బాధపరచకు!” అప్పుడు యేసు ఆ దయ్యంతో ఇలా అన్నాడు, “నీ పేరు ఏమిటి?” వాడు, “నా పేరు సేన, ఎందుకంటే మేము అనేకులం” అని జవాబిచ్చాడు, (“సేన” అంటే రోమా సైన్యంలో అనేక వేల సైనికుల సమూహం.)
వానిలోని దయ్యాలు యేసును బతిమాలుకొన్నాయి, “దయచేసి మమ్మును బయటకు తోలివేయకుము!” అక్కడకు దగ్గరలో కొండమీద ఒక పెద్ద పందుల గుంపు ఉంది, కనుక దయ్యాలు యేసును బతిమాలాయి, “దయచేసి మమ్మల్ని ఆ పందుల మందలోనికి పంపించండి!” అందుకు యేసు “వెళ్ళండి” అని ఆజ్ఞాపించాడు.
ఆ వ్యక్తిలో నుండి దయ్యాలు బయటికి వచ్చి ఆ పందులలో ప్రవేశించాయి. వెంటనే ఆ పందుల గుంపు పరుగున వెళ్లి ఆ సమద్రంలోని ఒక ప్రపాతంలో పడి మునిగి పోయాయి. అక్కడ ఆ గుంపులో దాదాపు 2,000 పందులు ఉన్నాయి.
ఆ పందులు కాయుచున్న కాపరులు అక్కడ ఉన్నారు, జరిగిన దానిని వారు చూచినప్పుడు వారు పట్టణం లోనికి పరుగున వెళ్ళారు. యేసు చేసిన దానిని ప్రజలందరికీ చెప్పారు. పట్టణంలోనుండి ప్రజలు యేసు వద్దకు వచ్చి దయ్యముల వెళ్ళిపోయిన వ్యక్తి వస్త్రములు ధరించి యేసు వద్ద స్వస్థ చిత్తుడిగా కూర్చుండడం చూసారు.
జరిగిన దానిని బట్టి వారు చాలా భయపడ్డారు, ఆ స్థలం విడిచిపెట్టాలని యేసును అడిగారు. కనుక యేసు అక్కడనుండి పడవ ఎక్కి బయలుదేరారు. దయ్యములు విడిచిపెట్టిన వ్యక్తి యేసుతో తనను ఉండనిమ్మని బతిమాలాడు.
అయితే యేసు అతనితో ఇలా చెప్పాడు, “నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళు, దేవుడు నీకు చేసిన కార్యాలను అందరితో చెప్పు, ఆయన నీ పట్ల ఏ విధంగా తన కనికరాన్ని చూపించాడో పంచుకో.”
కనుక ఆ మనిషి తన ఇంటికి వెళ్ళిపోయాడు, యేసు తనకు చేసిన వాటన్నిటినీ అందరితో పంచుకొన్నాడు. అతను చెపుతున్న వాటిని విని అందరూ ఆశ్చర్యపోయారు.
యేసు సముద్రం ఆవలి వైపుకు వచ్చాడు. ఆయన అక్కడకు చేరిన తరువాత, గొప్ప సమూహం ఆయన వద్దకు వచ్చారు, వారు ఆయన మీద పడుతున్నారు. ఆ సమూహంలో పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావరోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉంది. ఆమె స్వస్థత పొందడానికి తన డబ్బునంతా వైద్యులకు ఖర్చుచేసింది, అయితే ఆమె రోగం మరింత ఎక్కువయ్యింది.
యేసు అనేకులైన రోగులను స్వస్థపరచాడని ఆమె వినింది, “యేసు వస్త్రాలను తాకినట్లయితే బాగుపడుదును” అనుకొంది. కనుక ఆమె యేసు వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొంది. ఆయన వస్త్రాన్ని తాకిన వెంటనే ఆమె రక్త స్రావం నిలిచిపోయింది!
వెంటనే, యేసు తనలో నుండి ప్రభావం బయటికి వెళ్ళినట్లు గ్రహించాడు. కనుక ఆయన వెనుకకు తిరిగి, “నన్ను తాకినది ఎవరు?” అని అడిగాడు. అందుకు శిష్యులు ఇలా జవాబిచ్చారు, “నీ చుట్టూ అనేకమంది సమూహం నీ మీద పడుచుండగా ‘నన్ను తాకినది ఎవరు?’ అని అడుగుచున్నావేమిటి? అని శిష్యులు ఆయనను అడిగారు.
ఆ స్త్రీ యేసు పాదాల మీద పడింది, భయంతో వణికిపోతుంది. అప్పుడు ఆమె ఆయనతో జరిగినదంతా వివరించింది. తాను ఆమె స్వస్థత పొందాననీ చెప్పింది. యేసు ఆమెతో ఇలా అన్నాడు, “నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది. సమాధానంతో వెళ్ళు.”