unfoldingWord 21 - దేవుడు మెస్సీయను వాగ్దానం చేసాడు
รหัสบทความ: 1221
ภาษา: Telugu
ผู้ฟัง: General
เป้าหมายของสื่อบันทึกเสียง: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
สถานะ: Approved
บทความเป็นแนวทางพื้นฐานสำหรับการแปลและบันทึกเสียงภาษาอื่นๆ ควรดัดแปลงตามความจำเป็นเพื่อให้เข้าใจและเหมาะสมกับวัฒนธรรมและภาษาแต่ละภาษา คำศัพท์และแนวคิดบางคำที่ใช้อาจต้องอธิบายเพิ่มเติม หรือแทนที่ หรือตัดออก
เนื้อหาบทความ
దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పటికీ, కొంతకాలం తర్వాత ఆయన మెస్సీయను పంపిస్తానని వాగ్దానం చేశాడు. అవ్వ సంతానం సర్పం తల మీద కొడతాడు, అయితే, హవ్వను మోసగించిన సర్పం సాతాను. అతణ్ణి మెస్సియ ఓడిస్తాడు అని దేవునికి తెలుసు.
దేవుడు అబ్రాహాము ద్వారా లోకంలోని జనాంగాలన్నీ ఆశీర్వదించబడతాయని దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసాడు. కాలం సంపూర్ణం అయినప్పుడు దేవుడు మెస్సీయను పంపించడం ద్వారా ఈ వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. మెస్సీయ లోకంలోని ప్రతీ జనాంగంలోని ప్రజలను తమ పాపం నుండి రక్షిస్తాడు.
దేవుడు మోషే లాంటి మరొక ప్రవక్తను ఈ లోకం లోనికి పంపిస్తానని మోషేకు వాగ్దానం చేసాడు. ఈ ప్రవక్త మెస్సీయ. ఈ విధంగా దేవుడు మెస్సీయను పంపిస్తానని మరొకసారి వాగ్దానం చేసాడు.
తన సంతానంలో ఒకరు మెస్సీయ కాబోతున్నారని దేవుడు దావీదుకు వాగ్దానం చేసాడు. ఆయన తన ప్రజలకు రాజుగా ఉండి వారిని శాశ్వతంగా పాలిస్తాడు.
దేవుడు యిర్మియాతో మాట్లాడాడు, ఒకరోజున ఆయన ఒక నూతన నిబంధనను చేస్తానని చెప్పాడు. కొత్తనిబంధన తాను సీనాయి పర్వతం మీద ఇశ్రాయేలీయులతో చేసిన పాతనిబంధన లాంటిది కాదు. ఆయన తన ప్రజలతో కొత్తనిబంధన చేసినప్పుడు వారు ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకొనేలా చేస్తాడు. ప్రతీ వ్యక్తి ఆయనను ప్రేమిస్తారు, ఆయన నియమాలకు విధేయత చూపిస్తారు. ఇది వారి హృదయాలలో రాయబడియుంటుందని దేవుడు చెప్పాడు. వారు ఆయన ప్రజలై యుంటారు. దేవుడు వారి పాపాలను క్షమిస్తాడు. వారితో నూతన నిబంధన చేసేవాడు మెస్సీయానే.
దేవుని ప్రవక్తలు కూడా మెస్సీయ ఒక ప్రవక్తగానూ, యాజకునిగానూ, ఒక రాజుగా ఉండబోతున్నాడని చెప్పారు. ప్రవక్త అంటే దేవుని మాటలు విని ఆ సందేశాన్ని ప్రజలకు ప్రకటించువాడు. దేవుడు వాగ్దానం చేసే ఈ ప్రవక్త పరిపూర్ణుడైన ప్రవక్త. అంటే మెస్సీయ దేవుని సందేశాన్ని పరిపూర్ణంగా వింటాడు. వాటిని సంపూర్ణంగా అర్థం చేసుకొంటాడు. వాటిని ప్రజలకు పరిపూర్ణంగా బోధిస్తాడు.
ఇశ్రాయేలీయుల యాజకులు తమ ప్రజల కోసం బలులు అర్పించడం కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజలను తమ పాపముల విషయంలో దేవుడు వారికి ఇస్తున్న శిక్ష స్థానంలో ఈ బలులు ఉన్నాయి. యాజకులు కూడా ప్రజల కోసం ప్రార్థనలు చేస్తారు. అయితే మెస్సీయ పరిపూర్ణుడైన యాజకుడు, ఆయన తన్నుతాను సంపూర్ణ బలిగా అర్పించుకొంటాడు. ఆయన ఎన్నడూ పాపం చెయ్యలేదు. పాపం విషయంలో ఇకమీదట యే ఇతర బలి అవసరం లేదు.
రాజులూ, అధికారులు జనాంగముల మీద పాలన చేస్తారు, కొన్నిసార్లు వారు తప్పిదాలు చేస్తారు. రాజైన దావీరు ఇశ్రాయేలీయుల మీద మాత్రమే పాలన చేసాడు. అయితే దావీదు సంతానం అయిన మెస్సీయ లోకాన్నంతటినీ పాలిస్తాడు, శాశ్వతకాలం పాలిస్తాడు. ఆయన నీతిగా పాలిస్తాడు, సరియైన నిర్ణయాలు చేస్తాడు.
దేవుని ప్రవక్తలు ఈ మెస్సీయను గురించి ఇంకా అనేక ఇతర అంశాలు చెప్పారు. ఉదాహరణకు, ఈ మెస్సీయకు ముందు మరొక ప్రవక్త వస్తాడని మలాకి ప్రవక్త చెప్పాడు. ఆ ప్రవక్త చాలా ప్రాముఖ్యమైన వాడు. మెస్సీయ కన్యకు జన్మిస్తాడని యెషయా ప్రవక్త ప్రవచించాడు. మెస్సీయ బెత్లేహెం పట్టణంలో ఈ మెస్సీయ జన్మిస్తాడని మీకా ప్రవక్త ప్రవచించాడు.
మెస్సీయ గలిలయ ప్రాంతంలో నివసిస్తాడని యెషయా ప్రవక్త చెప్పాడు. దుఃఖంలో ఉన్నవారిని ఈ మెస్సీయ ఆదరిస్తాడు. చెరలో ఉన్నవారిని ఆయన విడుదల చేస్తాడు. రోగులను ఆయన బాగుచేస్తాడు. వినలేని వారికి వినికిడినీ, చూపులేని వారికి చూపునూ, మూగవారికీ మాటనూ, కుంటివారికి నడకనూ అనుగ్రహిస్తాడు.
ప్రజలు మెస్సీయను ద్వేషిస్తారు, ఆయనను అంగీకరించడానికి నిరాకరిస్తారని యెషయా ప్రవక్త చెప్పాడు. మెస్సీయ స్నేహితుడు ఒకరు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుతాడని ఇతర ప్రవక్తలు చెప్పారు. ఈ కార్యాన్ని చెయ్యడానికి ఈ స్నేహితునికి ముప్పై వెండి నాణెములు తీసుకొంటాడని జకర్యా ప్రవక్త చెప్పాడు. ప్రజలు మెస్సీయను చంపుతారని కొందరు ప్రవక్తలు చెప్పారు, ఆయన వస్త్రాల విషయంలో చీట్లు వేస్తారని మరికొందరు ప్రవక్తలు ముందుగానే చెప్పారు.
కొందరు ప్రవక్తలు మెస్సీయ ఏవిధంగా చనిపోతాడో చెప్పారు. ప్రజలు మెస్సీయ మీద ఉమ్మివేస్తారనీ, ఆయనను కొడతారనీ యెషయా చెప్పాడు. వారు ఆయన చేతులలో, కాళ్ళలో సీలలు కొడతారనీ, ఆయన ఏ పాపమూ చెయ్యకపోయినా ఆయన గొప్ప శ్రమలో వేదనలో చనిపొతాడనీ చెప్పాడు.
మెస్సీయ పాపం చెయ్యజాలడనీ ప్రవక్తలు చెప్పారు. ఆయన పరిపూర్ణుడిగా ఉంటాడు. ప్రజల పాపం కోసం దేవుడు ఆయనను శిక్షించిన కారణంగా ఆయన చనిపోతాడు. ఆయన చనిపోయినప్పుడు, మనుష్యులు దేవునితో సమాధానపరచబడతారు. ఈ కారణం దేవుడు మెస్సీయ చనిపోయేలా చెయ్యాలని కోరాడు.
మృతులలో నుండి దేవుడు ఈ మెస్సీయను తిరిగి లేవనెత్తుతాడని ప్రవక్తలు చెప్పారు. నూతన నిబంధన చెయ్యడంలో ఇదంతా దేవుని ప్రణాళిక అని చూపిస్తుంది. ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసినవారిని ఆయన రక్షిస్తాడు.
మెస్సీయను గురించి దేవుడు ప్రవక్తలకు అనేక సంగతులను బయలుపరచాడు. మెస్సీయ ఈ ప్రవక్తల కాలంలో రాలేదు. ఈ ప్రవక్తలలో ఆఖరు ప్రవక్త తరువాత 400 సంవత్సరాలకు, కాలం సంపూర్ణమైనప్పుడు, దేవుడు మెస్సీయను ఈ లోకానికి పంపించాడు.