unfoldingWord 50 - యేసు తిరిగిరావడం
План-конспект: Matthew 13:24-42; 22:13; 24:14; 28:18; John 4:35; 15:20; 16:33; 1 Thessalonians 4:13-5:11; James 1:12; Revelation 2:10; 20:10; 21-22
Номер текста: 1250
Язык: Telugu
Aудитория: General
Цель: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
статус: Approved
Сценарии - это основные инструкции по переводу и записи на другие языки. Их следует при необходимости адаптировать, чтобы сделать понятными и актуальными для каждой культуры и языка. Некоторые используемые термины и концепции могут нуждаться в дополнительном пояснении или даже полностью замещаться или опускаться.
Текст программы
2,000 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా మనుష్యులు అనేకులు మెస్సీయ యేసును గురించిన బోధ వింటున్నారు. సంఘం అనుదినం వృద్దిచెందుతుంది. లోకాంతంలో ప్రభువు తిరిగి రాబోతున్నాడని వాగ్దానం చేసాడు. ఆయన ఇంకా రాకపోయినప్పటికీ ఆయన తన వాగ్దానాన్నినెరవేరుస్తాడు.
ప్రభువైన యేసు రాకడకోసం మనం ఎదురు చూస్తుండగా ఆయనను ఘనపరచే పరిశుద్ధ జీవితం జీవించాలని ప్రభువు కోరుతున్నాడు. ఆయన రాజ్యం గురించి ఇతరులకు చెప్పాలని కూడా కోరుతున్నాడు. యేసు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన ఇలా చెప్పాడు, “సమస్త దేశాలలో ప్రతి ఒక్కరికీ నా శిష్యులు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటిస్తారు, అప్పుడు అంతం వచ్చును.”
అనేక ప్రజా గుంపులు ఇంకా యేసును గురించి వినలేదు. ఆయన పరలోకానికి వెళ్ళడానికి ముందు, సువార్త వినని వారికి సువార్తను ప్రకటించాలని ఆయన తన శిష్యులతో చప్పాడు. ఆయన ఇలా ఆజ్ఞ ఇచ్చాడు, “సమస్త దేశాలను వెళ్ళండి, సమస్త జనులను శిష్యులనుగా చెయ్యండి!”, “కొత్త విస్తారంగానూ సిద్ధంగానూ ఉంది!”
యేసు ఇలా కూడా చెప్పాడు, “ఒక దాసుడు అతని యజమానుని కంటే గొప్పవాడు కాదు. ఈ లోకంలో ఘనులైనవారు నన్ను ద్వేషించారు. వారు మిమ్మును కూడా శ్రమలపాలు చేస్తారు. నా నిమిత్తం మిమ్మల్ని చంపుతారు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. అయితే ధైర్యం తెచ్చుకొండి, ఎందుకంటే నేను ఈ లోకాధికారి సాతానును జయించి యున్నాను. అంతము వరకు నమ్మకముగా ఉన్న యెడల దేవుడు మిమ్మును రక్షిస్తాడు.
లోకం అంతమైనప్పుడు మనుష్యులకు ఏమి జరుగుతుందో చెప్పడానికి యేసు ఒక ఉపమానం చెప్పాడు. ఆయన ఇలా చెప్పాడు, “ఒక మనుష్యుడు తన పొలములో మంచి విత్తనాన్ని నాటాడు. ఆయన నిద్రపోతున్నప్పుడు అతని శత్రువు వచ్చి గోదుమ మొక్కలలో కలుపు మొక్కలను నాటి వెళ్ళిపోయాడు.
“మొక్కలు పెరిగినప్పుడు, ఆ మనుష్యుని సేవకులు వచ్చి ఆయనతో, “యజమానుడా, నీవు నీ పొలములో మంచి విత్తనాలను నాటావు, అయితే వాటిలో కలుపు మొక్కలు ఉన్నాయి” అని అన్నారు. దానికి యజమాని ఇలా జవాబిచ్చాడు, “కేవలం నా శత్రువులు మాత్రమే వాటిని నాటాలని కోరాడు, వాటిని వాడే నా టిఉంటాడు.”
“సేవకులు యజమానితో ఇలా అడిగారు, ‘మేము కలుపు మొక్కలను పెరికివేయవచ్చునా?’ అందుకు యజమాని, “వద్దు, మీరు అలా చేస్తే వాటితో పాటు గోధుమలను కూడా పెరికి వేస్తారు. పంట కాలం వరకూ ఎదురు చూడండి. అప్పుడు కలుపు మొక్కలను ఒక చోట సమకూర్చండి, వాటిని కాల్చివెయ్యండి. అయితే గోధుమ పంటని నా కొట్లలో సమకూర్చండి.’”
ఆ కథనంలోని అర్థాన్ని శిష్యులు తెలుసుకోలేదు. కనుక యేసు వారికి అర్థపరచాడు. ప్రభువు ఇలా చెప్పాడు, “మంచి విత్తనాన్ని విత్తువాడు ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తుంది, పొలం లోకాన్ని చూపుతుంది. మంచి మొక్కలు దేవుని రాజ్య ప్రజలను సూచిస్తుంది.”
“కలుపు మొక్కలు సాతాను చెందిన వ్యక్తులను సూచిస్తుంది, వాడు దుష్టుడు. వాడు మనుషులకు శత్రువు, కలుపు మొక్కలను నాటుతాడు. వాడు సాతానును చూపుతాడు. దాని పంట లోక అంతాన్ని సూచిస్తుంది. కోత కోయువారు దేవుని దూతలు.”
“లోకం అంతం అయినప్పుడు, దేవుని దూతలు సాతానుకు చెందిన వారందరిని పోగుచేస్తారు. వారిని చాలా వేడిగల అగ్నిలో వేస్తారు. అక్కడ ప్రజలు ఏడుస్తారు, మహా వేదనతో పండ్లు కోరుకుతారు, అయితే యేసును అనుసరించిన నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునివలే ప్రకాశిస్తారు.”
లోకఅంతానికి ముందు యేసు ఈ లోకానికి వస్తాడని ఆయన చెప్పాడు. ఆయన ఏవిధంగా వెళ్ళాడో అదే రీతిగా తిరిగి వస్తాడు. అంటే ఆయనకు నిజమైన దేహం ఉంటుంది, ఆకాశంలోని మేఘాల మీద ఆయన తిరిగి వస్తాడు. యేసు తిరిగి వచ్చినప్పుడు మృతుడైన ప్రతీ క్రైస్తవుడు మరణం నుండి తిరిగి లేస్తాడు, మధ్యాకాశంలో ఆయనను కలుసుకొంటాడు.
సజీవులుగా ఉండే క్రైస్తవులు ఆకాశంలోనికి కొనిపోబడతారు, మరణంనుండి తిరిగి లేచిన ఇతర క్రైస్తవులతో కలుసుకొంటారు. వారందరూ యేసుతో ఉంటారు. దాని తరువాత యేసు తన ప్రజలతో ఉంటాడు. వారు కలిసి ఉండడం ద్వారా సంపూర్ణ నెమ్మదిని యుగయుగములు కలిగియుంటారు.
ఆయన యందు విశ్వాస ముంచిన ప్రతీ ఒక్కరికీ నీతి కిరీటాన్ని ఇస్తానని యేసు వాగ్దానం చేసాడు. ఆయనతో కలసి సమస్తం మీద వారు శాశ్వతకాలం పరిపాలన చేస్తారు.
యేసు నందు విశ్వాశం ఉంచని వారిని దేవుడు తీర్పు తీరుస్తాడు. వారిని నరకంలో వేస్తాడు. అక్కడ వారు ఏడుస్తారు, పండ్లు కొరుకుతారు, శాశ్వత శ్రమల పాలవుతారు. అక్కడున్న అగ్ని ఆరిపోదు, నిరంతరం మండుతుంది. దానిలోని పురుగు చావదు.
ప్రభువైన యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన సాతానునూ, వాడి రాజ్యాన్ని సమూలంగా నాశన చేస్తాడు. సాతానును నరకంలో పడవేస్తాడు. అక్కడ వాడు శాశ్వతంగా కాలిపోతుంటాడు. వాడితో బాటు దేవునికి విధేయత చూపించకుండా సాతానును అనుసరించువారు నరకంలో పడతారు.
ఆదాము, హవ్వ దేవునికి అవిధేయత చూపించిన కారణంగా పాపాన్ని ఈ లోకానికి తీసుకొని వచ్చిన కారణంగా, దేవుడు పాపాన్ని శపించాడు, దానిని నాశనం చెయ్యాలని నిర్ణయించాడు.
ప్రభువైన యేసూ, ఆయన ప్రజలు భూమి మీద నివసిస్తారు, ఆయన సమస్తం మీద యుగయుగాలు పరిపాలన చేస్తాడు. ఆయన వారి ప్రతీ కన్నీటి బాష్ప బిందువునూ తుడుస్తాడు. ఏ ఒక్కరూ శ్రమ పొందారు, దుఃఖం ఉండరు. రోగం ఉండదు, మరణం ఉండదు. దుష్టత్వం ఉండనే ఉండదు. నీతితోనూ, సమాధానంతోనూ యేసు పరిపాలన చేస్తాడు. ఆయన తన ప్రజలతో శాశ్వతం ఉంటాడు.