unfoldingWord 47 - ఫిలిప్పిలో పౌలు, సీల
Esboço: Acts 16:11-40
Número do roteiro: 1247
Idioma: Telugu
Público alvo: General
Propósito: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
Estado: Approved
Os roteiros são guias básicos para a tradução e gravação em outros idiomas. Devem ser adaptados de acordo com a cultura e a língua de cada região, para fazê-lo relevante. Certos termos e conceitos podem precisar de uma explicação adicional ou mesmo serem omitidos no contexto de certos grupos culturais.
Texto do roteiro
సౌలు రోమా దేశం అంతా ప్రయాణం చేస్తుండగా అతని రోమా పేరును “పౌలు” వినియోగించడం ఆరంభించాడు. “పౌలు” అతని స్నేహితుడు సీల తో కలిసి ఒక రోజున ఫిలిప్పు పట్టణానికి యేసును గురించిన సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. వారు ఒక నదీ తీరానికి వెళ్ళారు. అక్కడ కొందరు ప్రార్థన చెయ్యడానికి కూడుకొన్నారు. అక్కడ లూదియ అనే ఒక స్త్రీని కలుసుకొన్నారు. ఆమె ఒక వ్యాపారస్తురాలు. ఆమె దేవుణ్ణి ప్రేమించింది, ఆయన ఆరాధిస్తుంది.
యేసును గురించిన వార్త విని విశ్వసించడానికి దేవుడు లూదియను బలపరచాడు. పౌలు, సీల ఆమెకునూ, ఆమె కుటుంబానికీ బాప్తిస్మం ఇచ్చారు. వారు తన ఇంటికి రావాలని ఆమె వారిని కోరింది. కనుక వారు అక్కడ ఉన్నారు.
యూదులు ప్రార్థించే చోట పౌలు, సీల తరచుగా వారిని కలుస్తున్నారు. ప్రతీ దినం వారు అక్కడికి నడిచి వెళ్తున్నప్పుడు ఒక బానిస బాలిక దయ్యముతో నిండి వారిని అనుసరిస్తూ ఉండేది. ఆమె ప్రజల భవిష్యత్తును ముందుగా ఊహించి చెపుతుండేది. తద్వారా ఆమె సోది చెప్పడం ద్వారా తన యజమానులకు అధికమైన డబ్బును సంపాదిస్తూ ఉండేది.
ఆ బానిస బాలిక వారు నడుస్తున్నప్పుడు తరచుగా, “వీరు సజీవుడైన దేవుని సేవకులు. వారు మీకు రక్షణ సువార్తను బోధించుచున్నారు.” ఈ విధంగా ఆమె తరచుగా చెయ్యడం ద్వారా పౌలు కోపగించుకొన్నాడు.
చివరిగా ఒక రోజున ఆ బానిస బాలిక అరుస్తుండగా పౌలు ఆమె వైపు తిరిగి ఆమెలో ఉన్న దయ్యంతో, “యేసు నామంలో ఈమెలోనుండి బయటికి రమ్ము.” అని గద్దించాడు. వెంటనే ఆమెలో ఉన్న దయ్యము ఆమెను విడిచిపెట్టింది.
ఆ బాలిక యజమాని జరిగిన దానిని బట్టి చాలా కోపగించుకొన్నాడు! దయ్యము లేక పోవడం చేత ఆ బానిస బాలిక ప్రజల భవిష్యత్తు విషయంలో సోది చెప్పలేదు అని యజానులు గుర్తించారు. దానిని బట్టి ప్రజలు తమకు జరుగుతున్నదానిని గురించి సోది చెప్పడం వల్ల తమకు కలిగే లాభసాధనం వారికి ఇక రాదు.
కనుక ఆ బాలిక యజమానులు పౌలునూ, సీలనూ రోమా అధికారుల వద్దకు తీసుకొని వెళ్ళారు. వారు పౌలునూ సీలనూ కొట్టారు, వారిద్దరినీ చెరసాలలో వేసారు.
వారు పౌలునూ, సీలను చెరసాలలో ఉంచారు, వారికి ఎక్కువమంది రక్షక భటులను ఉంచారు. వారి కాళ్ళకు బొండలు బిగించి బంధించారు. అయితే మధ్య రాత్రి సమయంలో పౌలు, సీలలు దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతున్నారు.
అకస్మాత్తుగా ఒక భయంకరమైన భూకంపం కలిగింది! చెరసాల తలుపులు తెరచుకొన్నాయి, ఖైదీల గొలుసులు తెగిపోయాయి.
అప్పుడు చెరసాల అధికారి మేల్కొన్నాడు. చెరసాల తలుపులు తెరచుకోవడం చూచాడు. ఖైదీలందరూ పారిపోయారని తలంచాడు. తాను ఖైదీలు పారిపోడానికి అనుమతించానని తలంచి రోమా అధికారులు తనను చంపుతారని భయపడ్డాడు. కనుక తనను తాను చంపుకోవాలని చూచాడు. అయితే పౌలు, “ఆగుము! నిన్ను నీవు చంపుకోవాల్సిన అవసరం లేదు. మేమందరం ఇక్కడే ఉన్నాం” అని బిగ్గరగా అరిచాడు.
చెరసాల అధిపతి భయంతో వణుకుతూ పౌలు, సీల వద్దకు వచ్చాడు. “రక్షణ పొందుటకు నేను ఏమి చెయ్యాలి?” అని వారిని అడిగాడు. పౌలు ఇలా జవాబిచ్చాడు, “ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారునూ రక్షణ పొందుదురు.” ఆ చెరసాల అధికారి వారిద్దరిని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. వారి గాయాలను బాగుచేసాడు. అతని ఇంటిలోని ప్రతీ ఒక్కరికీ పౌలు దేవుని గురించిన సువార్త చెప్పాడు.
చెరసాల అధికారి, అతని కుటుంబం యేసు నందు విశ్వాసముంచారు. కనుక పౌలు, సీల వారికి బాప్తిస్మం ఇచ్చారు. అప్పుడతడు వారికి ఆహారాన్ని పెట్టాడు. వారు కలిసి ఆనందించారు.
తరువాత దినం పట్టణపు అధికారులు పౌలు, సీలలను చెరసాలనుండి బయటకు తీసుకొని వచ్చి తమ పట్టణాన్ని విడిచి వెళ్ళమని చెప్పారు. పౌలు, సీల లూదియాను, ఇతర స్నేహితులను దర్శించి ఫిలిప్పు పట్టణాన్ని విడిచిపెట్టారు. యేసును గురించిన మంచి వార్త ఆ ప్రాంతం అంతా వ్యాపించించింది. సంఘం ఎదుగుతుంది.
పౌలూ, ఇతర క్రైస్తవ నాయకులూ అనేక నగరాలకు ప్రయాణం చేసారు. యేసును గురించిన మంచి వార్తను అనేకులకు ప్రకటించారు, బోధ చేసారు. సంఘాలలోని విశ్వాసులను ప్రోత్సహించడానికీ, బోధ చెయ్యడానికీ వారికి అనేక పత్రికలు కూడా రాసారు.