unfoldingWord 23 - యేసు జననం
रूपरेखा: Matthew 1-2; Luke 2
लिपि नम्बर: 1223
भाषा: Telugu
दर्शक: General
उद्देश्य: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
स्थिति: Approved
लिपिहरू अन्य भाषाहरूमा अनुवाद र रेकर्डिङका लागि आधारभूत दिशानिर्देशहरू हुन्। तिनीहरूलाई प्रत्येक फरक संस्कृति र भाषाको लागि बुझ्न योग्य र सान्दर्भिक बनाउन आवश्यक रूपमा अनुकूलित हुनुपर्छ। प्रयोग गरिएका केही सर्तहरू र अवधारणाहरूलाई थप व्याख्याको आवश्यकता हुन सक्छ वा पूर्ण रूपमा प्रतिस्थापन वा मेटाउन पनि सकिन्छ।
लिपि पाठ
మరియకీ యోసేపు అను ఒక నీతిమంతునికి నిశ్చితార్థం జరిగింది. మరియ గర్భవతి అని విన్నప్పుడు, ఆ బిడ్డ తన బిడ్డ కాదని తెలిసినప్పటికీ అతడు మరియను సిగ్గు పరచాలని కోరలేదు, కనుక ఆమె మీద కరుణ చూపించాలని ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలని నిర్ణయించాడు. ఆ పని చెయ్యడానికి ముందే, ఒక దేవదూత అతనికి కలలో కనిపించాడు, అతనితో మాట్లాడాడు.
దేవదూత, "యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకోడానికి నీవు భయపడకు, ఆమె కడుపులో ఉన్న శిశువు పరిశుద్ధాత్మ నుండి కలిగినది. ఆమె ఒక కుమారునికి జన్మనిస్తుంది, అతనికి యేసు అని పేరు పెడతావు. దీని అర్థం 'యెహోవా రక్షించేవాడు.' ఎందుకంటే ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు.
కనుక యోసేపు మరియను వివాహం చేసుకొన్నాడు, తన భార్య గాస్వీకరించాడు, అయితే ఆమె కుమారుని కనేంతవరకూ ఆమెతో లైంగికంగా కలియ లేదు.
మరియకు కుమారుడు జన్మించే సమయం వచ్చినప్పుడు ఆమె, యోసేపూ, బెత్లేహెం గ్రామం వరకూ బహు దూరం ప్రయాణం చెయ్యవలసి వచ్చింది. రోమా అధికారులు ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజల జనసంఖ్య వివరాలు తెలుసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ తమ పితరుల ప్రదేశానికి వెళ్లాలని ఆజ్ఞాపించారు. రాజైన దావీదు బెత్లేహెం గ్రామంలో పుట్టినవాడు, యోసేపు మరియలకు దావీదు పితరుడు కనుక మరియ యోసేపులు బెత్లేహెం గ్రామానికి ప్రయాణం అయ్యారు.
మరియ, యోసేపులు బెత్లేహెం గ్రామానికి వెళ్ళారు, అయితే వారు ఉండడానికి ఎక్కడా స్థలం లేదు. పశువుల శాలలో మాత్రమే వారికి బస చెయ్యడానికి స్థలం దొరికింది. అక్కడ మరియకు కుమారుడు జన్మించాడు. పశువుల తొట్టిలో చిన్నిబాలుడిని ఉంచారు. ఎందుకంటే బాలునికి మరొక చోటు లేదు. ఆ బాలునికి యేసు అనే పేరు పెట్టారు.
ఆ రాత్రి ఆ ప్రాంతంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో తమ మందను కాచుకొనుచున్నారు. అకస్మాత్తుగా ప్రకాశిస్తున్న దేవుని దూత వారి వద్ద ప్రత్యక్ష్యమయ్యాడు, ఆ గొల్లలతో ఆ దూత ఇలా చెప్పాడు, “భయపడకుడీ, నేను మీకు ఒక శుభవార్త తెలియజేస్తున్నాను, ప్రభువైన మెస్సీయ మీకోసం ఈ దినాన్న బెత్లేహెంలో జన్మించాడు.”
“మీరు వెళ్ళండి, బాలుని కనుగొనండి, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టడం మీరు చూస్తారు.” వెంటనే పరలోక సైన్య సమూహం ఆకాశమంత నిండి, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. వారు ఇలా పాడుతున్నారు, “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగును గాక!”
అప్పుడు దూతలు వెళ్ళిపోయారు. గొర్రెల కాపరులు శిశువుని చూడడానికి తమ గొర్రెలను విడిచివెళ్ళారు. బాలుడైన యేసు ఉంచిన చోటుకు వారు త్వరపడి వచ్చారు, పశువుల తొట్టిలోని శిశువును దేవుని దూతలు చెప్పిన విధంగా చూచారు. వారు అత్యానందభరితులయ్యారు. తరువాత తమ గొర్రెలు ఉన్న పొలాలకు వారు తిరిగి వెళ్ళారు. వారు చూచిన దాన్నంతటిని బట్టి, వినిన దానిని బట్టి వారు దేవుణ్ణి స్తుతించారు.
తూర్పున ఉన్న ఒక దేశంలో కొందరు జ్ఞానులు ఉన్నారు. వారు ఆకాశంలో ఒక అసాధారణ నక్షత్రాన్ని చూచారు. యూదుల కొత్త రాజు జన్మించినట్లు వారు చెప్పారు. కాబట్టి వారు బాలుడిని చూడడానికి వారి దేశం నుండి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. సుదీర్ఘ ప్రయాణం తరువాత వారు బేత్లెహేముకు వచ్చి యేసు, ఆయన తల్లిదండ్రులు ఉన్న ఇంటిని కనుగొన్నారు.
వారు యేసునూ, ఆయన తల్లి అయిన మరియనూ చూచి సాగిలపడి ఆయనను ఆరాధించారు. బాలుడైన యేసుకు విలువైన కానుకలను అర్పించారు. తమ స్వదేశాలకు తిరిగి వెళ్ళారు.