unfoldingWord 43 - సంఘ ఆరంభం

രൂപരേഖ: Acts 1:12-14; 2
മൂലരേഖ (സ്ക്രിപ്റ്റ്) നമ്പർ: 1243
ഭാഷ: Telugu
പ്രേക്ഷകർ: General
ഉദ്ദേശം: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
അവസ്ഥ: Approved
മറ്റ് ഭാഷകളിലേക്ക് വിവർത്തനം ചെയ്യുന്നതിനും റെക്കോർഡുചെയ്യുന്നതിനുമുള്ള അടിസ്ഥാന മാർഗ്ഗനിർദ്ദേശങ്ങളാണ് സ്ക്രിപ്റ്റുകൾ. ഓരോ വ്യത്യസ്ത സംസ്കാരത്തിനും ഭാഷയ്ക്കും അവ മനസ്സിലാക്കാവുന്നതും പ്രസക്തവുമാക്കുന്നതിന് അവ ആവശ്യാനുസരണം പൊരുത്തപ്പെടുത്തണം. ഉപയോഗിച്ച ചില നിബന്ധനകൾക്കും ആശയങ്ങൾക്കും കൂടുതൽ വിശദീകരണം ആവശ്യമായി വന്നേക്കാം അല്ലെങ്കിൽ രൂപാന്തരപ്പെടുത്തുകയോ പൂർണ്ണമായും ഒഴിവാക്കുകയോ ചെയ്യാം.
മൂലരേഖ (സ്ക്രിപ്റ്റ്) ടെക്സ്റ്റ്

యేసు పరలోకానికి ఆరోహణుడైన తరువాత, యేసు తమకు ఆజ్ఞాపించిన విధంగా ఆయన శిష్యులు యెరూషలెంలో నిలిచిపోయారు. విశ్వాసులు ప్రార్థన చెయ్యడానికి నిరంతరం కలుసుకొంటూ ఉండేవారు.

ప్రతీ సంవత్సరం, పస్కాపండుగ జరిగిన తరువాత 50 రోజులకు యూదులు పెంకోస్తు అనే ఒక ప్రాముఖ్యమైన పండుగను ఆచరించేవారు. ఈ పెంతెకోస్తు పండుగ యూదులు గోదుమల పంటకోత సందర్భంగా వచ్చేది. ప్రపంచం నలుమూలల నుండి యూదులు యెరూషలెంకు వచ్చి కలిసి పెంతెకోస్తు పండుగను ఆచరించేవారు. ఈ సంవత్సరం యేసు పరలోకానికి ఆరోహణుడైన తరువాత పెంతెకోస్తు పండుగ వచ్చింది.

విశ్వాసులందరూ కలిసి ఉన్నప్పుడు, అకస్మాత్తుగా వారు ఉన్న ఇల్లు ఒక బలమైన గాలి శబ్దంతో నిండిపోయింది. అగ్ని నాలుకల వలే విశ్వాసులందరి తలలమీద నిలిచినట్లు కనిపించింది. వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఇతర భాషలలో దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. ఈ భాషలు మాట్లాడడానికి పరిశుద్ధాత్ముడు వారిని బలపరచాడు.

యెరూషలెంలో ఉన్న ప్రజలు ఈ శబ్దాన్ని వినినప్పుడు జరుగుతున్నదానిని చూడదానికి సమూహాలుగా వచ్చారు. దేవుడు చేసిన గొప్ప కార్యాలను విశ్వాసులు ప్రకటించడం వారు విన్నారు. ఈ మాటలను వారు తమ సొంత భాషలలో వింటున్నందుకు వారు చాలా ఆశ్చర్య పోయారు.

శిష్యులు మద్యపానంతో నిండిపోయారని కొందరు చెప్పారు. అయితే పేతురు నిలిచి వారితో ఇలా చెప్పాడు, “నా మాట వినండి! ఈ మనుష్యులు మద్యంతో నిండి ఉండలేదు. మీరు చూస్తున్నది, యోవేలు ప్రవక్త చెప్పినదే ఇప్పుడు జరుగుతుంది. దేవుడు ఇలా చెప్పాడు, “అంత్య దినములలో నేను నా ఆత్మను కుమ్మరింతును.”

“ఇశ్రాయేలు ప్రజలారా, యేసు అను మనుష్యుడు ఆయనను కనుపరచుకోడానికి అనేక అద్భుత కార్యాలు చేసాడు. దేవుని శక్తి చేత అనేక గొప్ప కార్యాలు చేసాడు. మీకిది తెలుసు. ఈ కార్యాలు మీరు చూచారు. అయితే మీరు ఆయనను సిలువ వేసారు!”

“ప్రభువైన యేసు చనిపోయాడు, అయితే దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. ప్రవక్త రాసిన వచనం నెరవేర్పు జరిగింది: ‘నీ పరిశుద్ధుని నీవు సమాధిలో కుళ్ళు పట్టనీయవు.’ తండ్రియైన దేవుడు మృతులలో నుండి ఆయన సజీవునిగా లేపిన దానికి మేము సాక్ష్యులం.”

“తండ్రియైన దేవుడు తన కుడిపార్శ్వమున ఆయనను కూర్చుండపెట్టడం ద్వారా ఆయనను ఘనపరచాడు. ప్రభువైన యేసు తాను వాగ్దానం చేసిన విధంగా తన పరిశుద్ధాత్మను మన వద్దకు పంపాడు. మీరు చూచుచున్న, వినుచున్న కార్యములను పరిశుద్దాత్మ జరిగించుచున్నాడు.”

“మీరు యేసు అను ఈ మనుష్యుని సిలువ వేశారు. అయితే దేవుడు ఈయనను సమస్తము పైన ప్రభువుగానూ, మెస్సీయగానూ చేసాడు.

ప్రజలు పేతురు మాటలు వినుచున్నారు, ఆయన చెపుతున్న మాటలను బట్టి వారు లోతుగా ఒప్పించబడ్డారు. కనుక వారు పేతురునూ, మిగిలిన అపొస్తలులను అడిగారు, “సహోదరులారా, మేమేమి చెయ్యాలి?”

పేతురు వారికి ఇలా జావాబు చెప్పాడు, “మీలో ప్రతీ ఒక్కరూ దేవుడు మిమ్మును క్షమించునట్లు మీ పాపముల విషయంలో పశ్చాత్తాప పడాలి. యేసు క్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలి. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధాత్మ వరాన్ని అనుగ్రహిస్తాడు.

దాదాపు 3,000 మంది ప్రజలు పేతురు బోధను విశ్వసించారు. ప్రభువైన యేసుకు శిష్యులు అయ్యారు. వారి బాప్తిస్మం పొంది యెరూషలెం లోని సంఘంలో భాగం అయ్యారు.

విశ్వాసూ అపొస్తలుల బోధను నిరంతరం వింటూ వచ్చారు. వారు తరచుగా కలుస్తూ వస్తున్నారు. తరచుగా వారు ఒకరికొకరు ప్రార్థన చేస్తూ వస్తున్నారు. వారు కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ వస్తున్నారు. వారికున్న సమస్తాన్ని ఒకరికొకరు పంచుకొంటున్నారు. పట్టణంలో ప్రతీ ఒక్కరూ వీరిని గురించి మంచిగా మాట్లాడుతున్నారు. ప్రతీ దినం అనేకమంది విశ్వాసులుగా మారుతున్నారు.