unfoldingWord 04 - అబ్రాహాము తో దేవుని నిబంధన

개요: Genesis 11-15
스크립트 번호: 1204
언어: Telugu
주제: Living as a Christian (Obedience, Leaving old way, begin new way); Sin and Satan (Judgement, Heart, soul of man)
청중: General
목적: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
지위: Approved
이 스크립트는 다른 언어로 번역 및 녹음을위한 기본 지침입니다. 그것은 그것이 사용되는 각 영역에 맞게 다른 문화와 언어로 조정되어야 합니다. 사용되는 몇 가지 용어와 개념은 다른 문화에서는 다듬어지거나 생략해야 할 수도 있습니다.
스크립트 텍스트

జలప్రళయం తరువాత అనేక సంవత్సరాలకు లోకంలోని మనుష్యులు తిరిగి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసారు. ఒకరి పట్ల ఒకరు పాపం చేసారు. ఎందుకంటే వారందరూ ఒకే బాష మాట్లాడేవారు. దేవుడు తమకు ఆజ్ఞాపించిన ప్రకారంగా లోకాన్ని నింపడానికి బదులు ఒక నగరాన్ని కట్టడానికి ఒక చోట సమావేశం అయ్యారు.

వారు చాలా గర్విష్టులుగా ఉన్నారు, వారు జీవించే విధానంలో దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించాలని కోరుకోలేదు. చెడు చెయ్యడానికి వారు కలిసి పనిచేస్తున్నట్లయితే వారు మరిన్ని పాపపు కార్యాలు చెయ్యవచ్చునని దేవుడు చూసాడు.

అందుచేత దేవుడు లోకమంతట్లో ఉండే భాషను యెహోవా అక్కడ తారుమారు చేసి వాళ్ళను అక్కడనుంచి భూతలమంతటా చెదరగొట్టాడు. వాళ్ళు ఆ నగరాన్ని కట్టడం మానుకొన్నారు. ఆ నగరానికి “బాబెలు” అనే పేరు వచ్చింది. దాని అర్థం “తారుమారు.”

వందల సంవత్సరాల తరువాత, దేవుడు అబ్రాము అనే వ్యక్తితో ఇలా అన్నాడు, “నీవు నీ దేశం నుంచీ, నీ బంధువుల దగ్గరనుంచీ, నీ తండ్రి ఇంటినుంచీ బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నేను నిన్ను ఒక గొప్ప ప్రజ గా చేసి నిన్ను దీవించి, నీ పేరు గొప్ప చేస్తాను. నీవు దీవెనగా ఉంటావు. నిన్ను దీవించేవారిని నేను దీవిస్తాను. నిన్ను శపించేవారిని శపిస్తాను, నీమూలంగా లోకంలోని అన్ని వంశాలు ధన్యం అవుతాయి.”

కాబట్టి దేవుడు తనతో చెప్పిన మాట ప్రకారం అబ్రాము బయలుదేరాడు. అబ్రాము తన భార్య శారాయినీ, తన తమ్ముని కొడుకు లోత్‌నూ, హారానులో వారంతా గడించిన సంపదనూ, సంపాదించుకొన్న వ్యక్తులనూ తీసుకొని కనాను దేశానికి బయలుదేరి అక్కడికి చేరాడు.

అబ్రాము అక్కడకి చేరినప్పుడు దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమై, “నేనీ దేశం నీ సంతానానికి ప్రసాదిస్తాను, నీ సంతానం దానిని స్వాధీన పరచుకొంటారు” అన్నాడు. అబ్రాము ఆ భూభాగంలో స్థిరపడిపోయాడు.

ఒక రోజున సర్వాతీతుడైన దేవుని యాజకుడైన మెల్కీసెదెకు, యుద్ధంలో ఉన్న అబ్రామును కలుసుకున్నాడు. ఆయన అబ్రామును దీవిస్తూ ఇలా అన్నాడు, “ఆకాశాలనూ, భూమినీ సృజించిన సర్వాతీతుడైన దేవుడు అబ్రామును దీవిస్తాడు గాక. నీ శత్రువులను నీ చేతికప్పగించిన సర్వాతీతుడైన దేవునికి స్తుతులు కలుగుతాయి గాక.” అబ్రాము ఆయనకు అన్నిట్లో పదో భాగమిచ్చాడు.

అనేక సంవత్సరాలు గడిచిపోయాయి, అయితే అబ్రాము శారాయిలకు కుమారుడు లేడు. దేవుడు అబ్రాముతో మాట్లాడాడు, అబ్రాముకు కుమారుడు పుడతాడని మరల వాగ్దానం చేశాడు. అబ్రాము సంతానం ఆకాశపు నక్షత్రాల్లా అవుతారని వాగ్దానం చేసాడు. అబ్రాము దేవుణ్ణి విశ్వసించాడు. అబ్రాము దేవుని వాగ్దానాన్ని నమ్మాడు కనుక దేవుడు అతనిని నీతిమంతుడిగా ప్రకటించాడు.

అప్పుడు దేవుడు అబ్రాముతో నిబంధన చేసాడు. సాధారణంగా నిబంధన అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు సహాయ చేసుకోడానికి చేసే అంగీకారం. అయితే ఈ విషయంలో అబ్రాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడు అబ్రాముకు ఒక వాగ్దానం చేసాడు. అయినా అబ్రాము దేవుని స్వరాన్ని వినగలిగాడు. దేవుడు అబ్రాముతో ఇలా చెప్పాడు, “నీలో నుండి నీకు ఒక కుమారుడిని అనుగ్రహిస్తాను, ఈ కనాను భూభాగాన్ని నీ సంతానానికి ఇస్తాను.” అయినా అప్పటికి అబ్రాముకు కుమారుడు కలుగలేదు.