unfoldingWord 08 - దేవుడు యోసేపునూ అతని కుటుంబాన్నీ రక్షించాడు
ರೂಪರೇಖೆಯನ್ನು: Genesis 37-50
ಸ್ಕ್ರಿಪ್ಟ್ ಸಂಖ್ಯೆ: 1208
ಭಾಷೆ: Telugu
ಪ್ರೇಕ್ಷಕರು: General
ಉದ್ದೇಶ: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
ಸ್ಥಿತಿ: Approved
ಸ್ಕ್ರಿಪ್ಟ್ಗಳು ಇತರ ಭಾಷೆಗಳಿಗೆ ಅನುವಾದ ಮತ್ತು ರೆಕಾರ್ಡಿಂಗ್ಗೆ ಮೂಲ ಮಾರ್ಗಸೂಚಿಗಳಾಗಿವೆ. ಪ್ರತಿಯೊಂದು ವಿಭಿನ್ನ ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಭಾಷೆಗೆ ಅರ್ಥವಾಗುವಂತೆ ಮತ್ತು ಪ್ರಸ್ತುತವಾಗುವಂತೆ ಅವುಗಳನ್ನು ಅಗತ್ಯವಿರುವಂತೆ ಅಳವಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಬಳಸಿದ ಕೆಲವು ನಿಯಮಗಳು ಮತ್ತು ಪರಿಕಲ್ಪನೆಗಳಿಗೆ ಹೆಚ್ಚಿನ ವಿವರಣೆ ಬೇಕಾಗಬಹುದು ಅಥವಾ ಬದಲಾಯಿಸಬಹುದು ಅಥವಾ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಬಿಟ್ಟುಬಿಡಬಹುದು.
ಸ್ಕ್ರಿಪ್ಟ್ ಪಠ್ಯ
అనేక సంవత్సరాల తరువాత, యాకోబు వృద్దుడయిన తరువాత తనకు అత్యంత ప్రీతి పాత్రుడైన కుమారుడు యోసేపును పొలములో మందను కాస్తున్న తన సోదరులను పరామర్శించడానికి పంపాడు.
యోసేపు సహోదరులు అతనిని ద్వేషించారు, ఎందుకంటే తమ తండ్రి యోసేపును ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. యోసేపు వారి పరిపాలకుడిగా ఉంటాడని కలలు కన్నాడు. యోసేపు అతని అన్నల వద్దకు వచ్చినప్పుడు వారు అతనిని అవమానపరచారు, బానిస వర్తకులకు అమ్మి వేశారు.
యోసేపు ఇంటికి రావడానికి ముందు, వారు యోసేపు అంగీని చించారు, గొర్రె పిల్ల రక్తంలో ముంచారు, ఆ అంగీని తమ తండ్రి యాకోబుకు చూపించారు, ఒక అరణ్యపు జంతువు యోసేపును చంపియుండవచ్చునవి యాకోబుకు చెప్పారు. యాకోబు చాలా దుఃఖపడ్డాడు.
బానిస వర్తకులు యోసేపును ఐగుప్తుకు తీసుకొని వెళ్ళారు. ఐగుప్తు దేశం నైలు నదీ తీరంలో ఉన్న అతి పెద్ద శక్తివంతమైన దేశం. ఒక ప్రభుత్వ అధికారికి యోసేపును ఒక బానిసగా వారు అమ్మి వేశారు. యోసేపు తన యజమానికి నమ్మకంగా సేవ చేసాడు. దేవుడు యోసేపును ఆశీర్వదించాడు.
అతని అధికారి భార్య యోసేపుతో వ్యభిచరించాలని ప్రయత్నించింది, అయితే యోసేపు దేవునికి వ్యతిరేకంగా ఈ విధంగా పాపం చెయ్యడానికి నిరాకరించాడు. ఆమె చాలా కోపగించుకొంది, యోసేపు మీద తప్పుడు నిందలు వేసింది, ఫలితంగా యోసేపును బంధించి చెరసాలలో వేశారు. చెరసాలలో సయితం యోసేపు దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవుడు యోసేపును ఆశీర్వదించాడు.
రెండు సంవత్సరాల తరువాత తాను నిరపరాధి అయినప్పటికీ యోసేపు ఇంకా చెరసాలలో ఉన్నప్పుడు ఒక రాత్రి ఐగుప్తీయులు తమ రాజుగా పిలుచుకొనే ఫరోకు రెండు కలలు వచ్చాయి. అతని సలహాదారులలో ఏ ఒక్కరునూ ఆ కలల భావాన్ని చెప్పలేక పోయారు.
కలల భావాన్ని చెప్పే సామర్ధ్యాన్ని దేవుడు యోసేపు అనుగ్రహించాడు. కనుక ఫరో చెరసాలలో నుండి యోసేపును వెలుపలికి రప్పించాడు. యోసేపు ఆ కలల భావాన్ని ఫరోకు తెలియచెప్పాడు, రాజుతో ఇలా అన్నాడు, “దేవుడు రానున్న ఏడు సంవత్సరాలలో విస్తారమైన పంటను నీకు అనుగ్రహించబోతున్నాడు, దాని తరువాత ఏడు సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది.”
యోసేపు చెప్పిన దాని విషయంలో ఫరో చాలా సంతోషించాడు, ఐగుప్తులో చక్రవర్తి తరువాత స్థానంలో యోసేపును నియమించాడు.
ఏడు సంవత్సరాల పంట కాలంలో ఆ పంటను దాచియుంచాలని యోసేపు అధికారులకు ఆజ్ఞాపించాడు. కరువు వచ్చిన ఏడు సంవత్సరాల కాలంలో ధాన్యాన్ని ప్రజలకు అమ్మాడు, తద్వారా ప్రజల ఆహారానికి కొదువ లేకుండా ఉంది.
కరువు కాలం ఐగుప్తు కాలంలో మాత్రమే కాక యాకోబూ, అతని కుటుంబం నివసిస్తున్న కనానులో కూడా విస్తారంగా ఉంది.
అందుచేత యాకోబు ఆహారాన్ని కొనడానికి తన పెద్ద కుమారులను ఐగుప్తుకు పంపాడు. ఆ సహోదరులు ఆహారాన్ని కొనడానికి యోసేపు ముందు నిలిచినప్పుడు యోసేపును గుర్తు పట్టలేక పోయారు. అయితే యోసేపు వారిని గుర్తుపట్టారు.
తన సహోదరులు మార్పు చెందారో లేదో అని వారిని పరీక్షించిన తరువాత యోసేపు వారితో ఇలా అన్నాడు, “నేను మీ సహోదరుడను, యోసేపును! భయపడకండి. ఒక బానిసగా నన్ను అమ్మినప్పుడు మీరు నాకు హాని కలుగచెయ్యడానికి ప్రయత్నించారు. అయితే దేవుడు కీడును మేలుగా మార్చాడు! రండి, ఐగుప్తులో నివసించండి తద్వారా నేను మీకునూ, మీ కుటుంబాలకునూ పోషణ కలుగ జేస్తాను.”
యోసేపు సహోదరులు ఇంటికి చేరినప్పుడు వారి జరిగినవాటన్నిటిని తమ తండ్రి, యాకోబుతో చెప్పారు. యోసేపు సజీవుడిగా ఉన్నాడని చెప్పారు. యాకోబు అధికంగా సంతోషించాడు.
యాకోబు వృద్దుడైనప్పటికీ తన కుటుంబం అంతటితో ఐగుప్తుకు ప్రయాణం అయ్యాడు. వారు అందరూ అక్కడ నివాసం చేసారు. యాకోబు చనిపోవడానికి ముందు తన కుమారులందరినీ ఆశీర్వదించాడు.
అబ్రాహాముకు దేవుడు ఇచ్చిన నిబంధన వాగ్దానాలు ఇస్సాకుకు, తరువాత యాకోబుకు, ఆ తరువాత యాకోబు పన్నెండు మంది కుమారులు, వారి కుటుంబాలకు కొనసాగాయి. యాకోబు పన్నెండు కుమారుల సంతానం ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలుగా మారారు.