unfoldingWord 06 - దేవుడు ఇస్సాకుకు సమకూర్చాడు

គ្រោង: Genesis 24:1-25:26
លេខស្គ្រីប: 1206
ភាសា: Telugu
ទស្សនិកជន: General
គោលបំណង: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
ស្ថានភាព: Approved
ស្គ្រីបគឺជាគោលការណ៍ណែនាំជាមូលដ្ឋានសម្រាប់ការបកប្រែ និងការកត់ត្រាជាភាសាផ្សេង។ ពួកគេគួរតែត្រូវបានកែសម្រួលតាមការចាំបាច់ដើម្បីធ្វើឱ្យពួកគេអាចយល់បាន និងពាក់ព័ន្ធសម្រាប់វប្បធម៌ និងភាសាផ្សេងៗគ្នា។ ពាក្យ និងគោលគំនិតមួយចំនួនដែលប្រើអាចត្រូវការការពន្យល់បន្ថែម ឬសូម្បីតែត្រូវបានជំនួស ឬលុបចោលទាំងស្រុង។
អត្ថបទស្គ្រីប

అబ్రాహాము అబ్రాహాము వయసు మళ్ళిన వృద్ధుడు అయ్యాడు. ఇస్సాకు పెరిగి పెద్దవాడయ్యాడు. కాబట్టి తన సేవకుని పిలిచి తన స్వదేశానికీ, తన బంధువుల దగ్గరికీ వెళ్ళి అక్కడ ఇస్సాకుకు భార్యను తీసుకొని రమ్మని పంపాడు.

చాలా దూరంలో ఉన్న అబ్రాహాము బంధువులు నివసించే ప్రాంతానికి ప్రయాణం చేసిన తరువాత దేవుడు అబ్రాహాము సేవకుడిని రిబ్కా వద్దకు నడిపించాడు. ఆమె అబ్రాహాము సోదరుని మనుమరాలు.

రిబ్కా తన కుటుంబాన్ని విడిచిపెట్టడానికీ, సేవకునితో ఇస్సాకు ఇంటికి రావడానికీ అంగీకరించింది. ఆమె ఇంటికి వచ్చిన వెంటనే ఇస్సాకు ఆమెను పెండ్లి చేసుకొన్నాడు.

చాలా కాలం తరువాత అబ్రాహాము చనిపోయాడు, అప్పుడు దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనను బట్టి అబ్రాహాము కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. అసంఖ్యాకమైన సంతానాన్ని అనుగ్రహిస్తానని చేసిన వాగ్దానం ఆ నిబంధనలో ఒక భాగం. అయితే ఇస్సాకు భార్య రిబ్కాకు పిల్లలు లేరు.

ఇస్సాకు రిబ్కా కోసం ప్రార్థన చేసాడు. దేవుడు ఆమెకు కవల పిల్లలను గర్భం ధరించడానికి అనుమతించాడు. తల్లి గర్భంలో ఉండగానే ఇద్దరు బిడ్డలు ఒకరితో ఒకరు పోట్లాడుకొనేవారు, జరగబోతున్నదానిని గురించి రిబ్కా దేవుణ్ణి అడిగింది.

దేవుడు ఆమెతో ఇలా చెప్పాడు, “నీ గర్భంలో రెండు జనాలు ఉన్నాయి. నీలోనుంచి ఇద్దరు గోత్రకర్తలు వస్తారు. పుట్టుకనుంచే ఒకడంటే రెండోవాడికి గిట్టదు. ఒక గోత్రం కంటే మరో గోత్రం బలంగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడు.”

ప్రసవ దినం వచ్చింది. ఆమె గర్భంలో కవల పిల్లలున్నారు. మొదటివాడు ఎర్రని వాడుగా ఒళ్ళంతటికీ రోమ వస్త్రం చుట్టి ఉన్నట్టు బయటికి వచ్చాడు గనుక అతడికి ఏశావు అనే పేరు పెట్టారు. తరువాత ఏశావు మడమను పట్టుకొని అతడి తమ్ముడు బయటికి వచ్చాడు గనుక అతడికి యాకోబు అనే పేరు పెట్టారు.