unfoldingWord 37 - చనిపోయిన లాజరును యేసు లేపడం
គ្រោង: John 11:1-46
លេខស្គ្រីប: 1237
ភាសា: Telugu
ទស្សនិកជន: General
ប្រភេទ: Bible Stories & Teac
គោលបំណង: Evangelism; Teaching
សម្រង់ព្រះគម្ពីរ: Paraphrase
ស្ថានភាព: Approved
ស្គ្រីបគឺជាគោលការណ៍ណែនាំជាមូលដ្ឋានសម្រាប់ការបកប្រែ និងការកត់ត្រាជាភាសាផ្សេង។ ពួកគេគួរតែត្រូវបានកែសម្រួលតាមការចាំបាច់ដើម្បីធ្វើឱ្យពួកគេអាចយល់បាន និងពាក់ព័ន្ធសម្រាប់វប្បធម៌ និងភាសាផ្សេងៗគ្នា។ ពាក្យ និងគោលគំនិតមួយចំនួនដែលប្រើអាចត្រូវការការពន្យល់បន្ថែម ឬសូម្បីតែត្រូវបានជំនួស ឬលុបចោលទាំងស្រុង។
អត្ថបទស្គ្រីប
లాజరు అనే పేరుగల ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి మరియ, మార్త అను ఇద్దరు సోదరీలు ఉన్నారు. వారు యేసుకు అత్యంత సమీప స్నేహితులు. ఒక రోజున లాజరు రోగియై ఉన్నాడని యేసుకు చెప్పారు. యేసు ఈ సంగతి వినినప్పుడు, “ఈ వ్యాధి లాజరు చనిపోవడానికి రాలేదు, ప్రజలు దేవుణ్ణి మహిమ పరచడానికి వచ్చింది” అని చెప్పాడు.
యేసు ఆయన స్నేహితుల యెంతో ప్రేమించాడు. అయితే తాను నిలిచియున్న చోటనే యేసు రెండు రోజులు ఆగిపోయాడు. ఆ రెండు రోజుల గడచిన తరువాత ఆయన తన శిష్యులతో, “మనం యూదయకు వెల్లుదము రండి” అని చెప్పాడు. అందుకు శిష్యులు, “ప్రభువా కొద్ది కాలం క్రితమే వారు నిన్ను చంపాలని చూచారు కదూ!” అని యేసును అడిగారు. యేసు ఇలా అన్నాడు, “మన స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు, మనం ఆయనను మేల్కొల్పుదాం రండి.”
యేసు శిష్యులు ఇలా జవాబిచ్చారు, “ప్రభూ, లాజరు నిద్రిస్తున్నట్లయితే మనం వెళ్ళడం మంచిదే.” అప్పుడు యేసు వారితో “లాజరు చనిపోయాడు. మీరు నా యందు విశ్వాసం ఉంచులాగున మనం అక్కడ లేకుండా ఉండడం మంచిది.”
యేసు లాజరు గ్రామానికి వచ్చినప్పుడు, లాజరు అప్పటికి చనిపోయి నాలుగు రోజులయ్యింది. మార్త యేసును ఎదుర్కొనడానికి బయటకు వెళ్లింది. ఆమె యేసుతో ఇలా అంది, “ప్రభూ నీవిక్కడ ఉండిన యెడల నా సోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు, అయిననూ తండ్రిని నీవేమి అడిగిననూ ఆయన నీకు అనుగ్రహించునని నేనెరుగుదును.”
యేసు జవాబిచ్చాడు, “పునరుత్థానమునూ, జీవమునూ నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయిననూ జీవించును. బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు మరెన్నటికూ చనిపోడు. ఈ మాట నీవు నమ్ముచున్నావా?” మార్త ఇలా జవాబిచ్చింది, “అవును ప్రభూ! నేను నమ్ముచున్నాను, నీవు దేవుని కుమారుడవైన మెస్సీయ అని నమ్ముచున్నాను.”
అప్పడు మరియ అక్కడికి వచ్చింది. “ప్రభూ, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు.” అని ప్రభువుతో చెప్పింది. యేసు ఆమెను ఇలా అడిగాడు, “లాజరును ఎక్కడ ఉంచారు?” వారు, “సమాధిలో ఉంచాము, వచ్చి చూడుము.” అని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచాడు.
సమాధి ఒక గుహలా ఉంది, దాని ముందు భాగంలో ఒక రాయి దొర్లించబడి ఉంది. యేసు సమాధి వద్దకు వచ్చినప్పుడు, “ఆ రాయిని దొర్లించండి” అని వారితో చెప్పాడు. అయితే మార్త ఆయనతో, “లాజరు చనిపోయి నాలుగు రోజులు అయ్యింది. చెడు వాసన వస్తుంది.” అని చెప్పింది.
యేసు వారితో ఇలా జవాబు ఇచ్చాడు, “మీరు నాయందు విశ్వాసముంచిన యెడల దేవుని శక్తిని చూస్తారని నేను మీతో చెప్పలేదా?” కనుక వారు సమాధిమీద నుండి రాయిని దొర్లించారు.
అప్పుడు యేసు ఆకాశం వైపుకు తన కన్నులెత్తి ఇలా ప్రార్థించాడు, “తండ్రీ నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతలు. నీవు ఎల్లప్పుడూ నా మనవి వింటావని నాకు తెలుసు. ఇక్కడ నిలిచిన వారందరికీ సహాయపడేలా ఈ ప్రార్థన చేస్తున్నాను, తద్వారా నీవు నన్ను పంపావని వారు తెలుసుకుంటారు..” తరువాత ఆయన బిగ్గరగా అరిచాడు, “లాజరూ బయటి రా!”
కనుక లాజరు బయటికి వచ్చాడు! అతడింకా సమాధి వస్తాలతోనే ఉన్నాడు. యేసు వారితో చెప్పాడు, “అతని వస్త్రాలు తొలగించండి, అతని విడిపించండి!” ఈ ఆశ్చర్యకార్యాన్ని బట్టి అనేకు యేసు నందు విశ్వాసముంచారు.
యూదుల నాయకులు యేసు విషయంలో అసూయ చెందారు కనుక వారు కలిసి యేసునూ, ఆయనతో కూడా ఉన్న లాజరును చంపాలని కుట్రపన్నారు.