unfoldingWord 48 - యేసు వాగ్దానం చెయ్యబడిన మెస్సీయ
מתווה: Genesis 1-3, 6, 14, 22; Exodus 12, 20; 2 Samuel 7; Hebrews 3:1-6, 4:14-5:10, 7:1-8:13, 9:11-10:18; Revelation 21
מספר תסריט: 1248
שפה: Telugu
קהל: General
מַטָרָה: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
סטָטוּס: Approved
סקריפטים הם קווים מנחים בסיסיים לתרגום והקלטה לשפות אחרות. יש להתאים אותם לפי הצורך כדי להפוך אותם למובנים ורלוונטיים לכל תרבות ושפה אחרת. מונחים ומושגים מסוימים שבהם נעשה שימוש עשויים להזדקק להסבר נוסף או אפילו להחלפה או להשמיט לחלוטין.
טקסט תסריט
దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడు, సమస్తం సంపూర్ణంగా ఉంది. పాపం లేదు. ఆదాము, హవ్వ ఒకరిపట్ల ఒకరు ప్రేమతో ఉన్నారు. వారు దేవుణ్ణి ప్రేమించారు. వ్యాధి లేదు, మరణం లేదు. ఈ రీతిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు.
సాతాను సర్పం ద్వారా హవ్వతో మాట్లాడాడు. ఆమెను మోసం చెయ్యాలని వాడు కోరాడు. అప్పుడు ఆమెయూ, ఆదామునూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసారు. వారు పాపం చేసారు కాబట్టి భూమి మీద ఉన్నవారందరి మీదకు మరణం వచ్చింది.
ఆదాము, హవ్వ పాపం చేసారు కాబట్టి, మరింత దారుణమైన ఫలితం కలిగింది. వారు దేవునికి శత్రువులయ్యారు. దాని ఫలితంగా అప్పటినుండి ప్రతీ మానవుడు పాపం చేసారు. ప్రతీ వ్యక్తి జన్మనుండి దేవునికి శత్రువు అయ్యారు. ప్రజలకు, దేవునికి మధ్య సమాధానం లేదు. దేవుడు సమాధం కలిగించాలని కోరాడు.
హవ్వ సంతానం సాతాను తలను చితకగొడతాడని దేవుడు వాగ్దానం చేసాడు. సర్పం ఆయన మడెమె మీద కొడతాడని చెప్పాడు. అంటే సాతాను మెస్సీయను చంపాలని చూసాడు. అయితే దేవుడాయనను తిరిగి లేపుతాడు. తరువాత మెస్సీయ సాతాను శక్తిని శాశ్వత కాలం తీసివేస్తాడు. అనేక సంవత్సారాల తరువాత ఆ మెస్సీయాయే యేసు అని దేవుడు చూపించాడు.
దేవుడు తాను పంపబోవు జలప్రళయంనుండి కాపాడుకోవడానికి ఒక ఓడను తయారు చేసుకొమ్మని దేవుడు నోవాహుతో చెప్పాడు. ఆయన యందు విశ్వాసముంచిన వారిని ఆయన ఈ విధంగా రక్షించాడు. ప్రతి ఒక్కరూ దేవుడు ఇచ్చే మరణ శిక్షకు పాత్రులే. ఎందుకంటే వారు పాపం చేసారు. అయితే దేవుడు ఆయన యందు విశ్వాసముంచు ప్రతిఒక్కరిని రక్షించడానికి తన కుమారుడైన యేసును ఈ లోకానికి పంపించాడు.
అనేక వందలాది సంవత్సరాలు, యాజకులు దేవునికి బలులు అర్పిస్తూ వచ్చారు. అయితే ఆ బలులు వారి పాపాలను క్షమించలేవు. యేసు గొప్ప ప్రధాన యాజకుడు. యాజకులు చేయలేని దానిని ఆయన చేసాడు. ప్రతిఒక్కరి పాపాన్ని తీసివేయడానికి ఆయన తన్నుతాను బలిగా అర్పించుకొన్నాడు. మనుష్యులందరి పాపాలకు దేవుని శిక్షను ఆయన పొందడానికి అంగీకరించాడు. ఈ కారణంచేత యేసు ప్రధానయాజకునిగా సంపూర్ణుడు.
దేవుడు అబ్రాహాముతో ఇలా చెప్పాడు, “నీ ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనాంగమును ఆశీర్వదిస్తాను.” ప్రభువైన యేసు ఈ అబ్రాహాము సంతానం. యేసు నందు విశ్వాస ముంచిన ప్రతీ ఒక్కరిని తమ పాపాలనుండి దేవుడు రక్షించిన కారణంగా ఈ సమస్త జనాంగమును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ ప్రజలు యేసునందు విశ్వాసముంచినప్పుడు దేవుడు వారిని అబ్రాహాము సంతానంగా వారిని యెంచుతాడు.
తన సొంత కుమారుడు ఇస్సాకును ఆయనకు బలిగా అర్పించాలని దేవుడు అబ్రాహాముకు చెప్పాడు. అయితే దేవుడు ఇస్సాకుకు బదులుగా ఒక గొర్రెపిల్లను అనుగ్రహించాడు. మనం అందరం మన పాపాలకు శిక్షను పొందడానికి అర్హులం! అయితే మన స్థానంలో మనకు బదులుగా బలిగా చనిపోడానికి దేవుడు తన ఏకైక కుమారుడైన యేసును మనకోసం అనుగ్రహించాడు. ఆ కారణంగా ప్రభువైన యేసును దేవుని గొర్రెపిల్ల అని పిలుస్తాం.
ఐగుప్తు మీద దేవుడు చివరి తెగులును పంపించినప్పుడు ప్రతీ ఇశ్రాయేలు కుటుంబం ఒక గొర్రెపిల్లను చంపాలని ఆయన చెప్పాడు. గొర్రెపిల్లలో ఎటువంటి లోపమూ ఉండకూడదు. అప్పుడు దాని రక్తాన్ని వారు తమ ద్వారాల మీద, ప్రక్కల ప్రోక్షించాలి. దేవుడు ఆ రక్తాన్ని చూచినప్పుడు ఆ గృహాలను ఆయన దాటిపోయాడు. వారిలో జ్యేష్టసంతానాన్ని సంహరించలేదు. ఇది జరిగినప్పుడు దేవుడు దీనిని పస్కా అని పిలిచాడు.
యేసు పస్కా గొర్రెపిల్లలా ఉన్నాడు. ఆయన ఎన్నడూ పాపం చెయ్యలేదు. కనుక ఆయనలో ఏ దోషమూ లేదు. పస్కాపండుగ సమయంతో ఆయన చనిపోయాడు. యేసునందు విశ్వాసముంచిన వారెవరైనా ఆ వ్యక్తి పాపం కోసం ఆయన రక్తం వెల చెల్లిస్తుంది. దేవుడు తానే ఆ వ్యక్తిని దాటిపోయినట్టుగా ఉంది. ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తిని శిక్షించడు.
దేవుడు ఇశ్రాయేలుతో నిబంధన చేసాడు. ఎందుకంటే వారు తనకు చెందినవారిగా ఉండడానికి ఆయన వారిని ఎంపిక చేసుకొన్నాడు. ఇప్పుడు దేవుడు ప్రతిఒక్కరికోసం ఒక నూతన నిబంధన చేసాడు. ఏ ప్రజాతెగలో ఎవరైనా ఈ నూతన నిబంధనను అంగీకరిస్తే వారు దేవుని ప్రజతో కలుస్తారు. దేవుడు ఇలా చేస్తాడు, ఎందుకంటే వారు యేసునంది విశ్వాసముంచారు.
దేవుని వాక్యాన్ని మహాశక్తితో ప్రకటించిన ప్రవక్త మోషే. అయితే యేసు ప్రవక్తలందరిలో శ్రేష్టుడు. ఆయన దేవుడు. కనుక ఆయన చేసిన సమస్తం, ఆయన మాట్లాడిన ప్రతీ మాట దేవుని కార్యాలు, దేవుని మాటలు. ఈ కారణం చేత యేసు దేవుని వాక్కుగా పిలువబడ్డాడు.
దావీదు సంతానంలో ఒకరు దేవుని ప్రజలను శాశ్వతం పాలిస్తాడని దేవుడు దావీదుతో వాగ్దానం చేసాడు. ప్రభువైన యేసు దేవుని కుమారుడు, మెస్సీయ. కనుక శాశ్వతకాలం పాలించడానికి ఆయన దావీదు కుమారుడు.
దావీదు ఇశ్రాయేలు రాజు. అయితే ప్రభువైన యేసు సర్వలోకానికీ రాజు! ఆయన మరల రాబోతున్నాడు. ఆయన రాజ్యాన్ని నీతితోనూ, సమాధానంతోనూ శాశ్వత కాలం పాలిస్తాడు.