unfoldingWord 16 - విడిపించు వారు
מתווה: Judges 1-3; 6-8; 1 Samuel 1-10
מספר תסריט: 1216
שפה: Telugu
קהל: General
ז׳נר: Bible Stories & Teac
מַטָרָה: Evangelism; Teaching
ציטוט כתבי הקודש: Paraphrase
סטָטוּס: Approved
סקריפטים הם קווים מנחים בסיסיים לתרגום והקלטה לשפות אחרות. יש להתאים אותם לפי הצורך כדי להפוך אותם למובנים ורלוונטיים לכל תרבות ושפה אחרת. מונחים ומושגים מסוימים שבהם נעשה שימוש עשויים להזדקק להסבר נוסף או אפילו להחלפה או להשמיט לחלוטין.
טקסט תסריט
యెహోషువ మరణించిన తరువాత ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులయ్యారు. . వారు దేవుని నియమాలకు విధేయత చూపలేదు, వాగ్దాన దేశము నుండి మిగిలిన కనానీయులను తరిమి వెయ్యలేదు. ఇశ్రాయేలీయులు యెహోవా దేవునికి బదులుగా కనానీయుల దేవతలను పూజించడం ఆరంభించారు. ఇశ్రాయేలీయులకు రాజు లేడు, కనుక ప్రతి ఒక్కరూ ఎవరికీ వారు తమకు సరియైనదిగా తోచిన విధంగా చేస్తూ వచ్చారు.
దేవునికి అవిధేయత చూపించడం ద్వారా ఇశ్రాయేలీయులు అనేకసార్లు పునరావృతమయ్యే ఒక విధానాన్ని కొనసాగించారు. అదేమిటంటే: ఇశ్రాయేలీయులు చాలా సంవత్సరాలుగా దేవునికి అవిధేయత చూపిస్తున్నారు, అప్పుడు దేవుడు వారిని ఓడించడానికి వారి మీదకు వారి శత్రువులను అనుమతించడం ద్వారా వారిని శిక్షిస్తున్నాడు, ఈ శత్రువులు ఇశ్రాయేలీయుల మీద దాడి చేసి వారిని దోచుకోవడం, వారి ఆస్తిని నాశనం చెయ్యడం, వారిలో అనేకమందిని చంపడం. ఇశ్రాయేలీయుల శత్రువులు చాలా సంవత్సరాలు వారిని అణచివేసిన తరువాత, ఇశ్రాయేలీయులు తమ పాపం విషయంలో పశ్చాత్తాపపడడం, తమను రక్షించమని దేవుణ్ణి అడగడం.
ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడిన ప్రతీసారి, దేవుడు వారిని కాపాడుతుండేవాడు, వారికి ఒక విమోచకుని అనుగ్రహించడం ద్వారా వారిని కాపాడుతుండేవాడు-వారి శత్రువులకు వ్యతిరేకంగా పోరాడి వారిని ఓడించేవాడు. వారి దేశంలో నెమ్మది ఉండేది. ఆ న్యాయాధిపతి వారిని సరిగా పరిపాలించేవాడు. దేవుడు ఇశ్రాయేలీయులను ఓడించేందుకు వారి మీదకు మిద్యానీయులను అనుమతించడం ద్వారా దీనిని తిరిగి చేసాడు.
మిద్యానీయులు ఇశ్రాయేలీయుల పంటలను ఏడు సంవత్సరాలుగా ఆక్రమించారు. ఇశ్రాయేలీయులు చాలా భయపడ్డారు, మిద్యానువారు తమను కనుగొనకుండా వారు గుహలలో దాక్కునేవారు. చివరకు, తమ్మును రక్షించాలని వారు దేవుణ్ణి మొరపెట్టారు.
ఇశ్రాయేలీయులలో గిద్యోను అనే మనిషి ఉన్నాడు. ఒక రోజున, అతను ఒక రహస్య స్థలంలో ధాన్యాన్ని దుళ్ళ గొట్టుతూ ఉన్నాడు. మిద్యానీయులు తనను చూడకుండా ఉండేలా రహస్యంగా ఆ పని చేస్తున్నాడు. దేవుని దూత గిద్యోను వద్దకు వచ్చి ఇలా అన్నాడు, “పరాక్రమము గల బలాడ్యుడా, వెళ్ళుము, మిద్యాను ప్రజల నుండి ఇశ్రాయేలీయులను రక్షించుము."
గిద్యోను తండ్రి ఒక విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ఆ బలిపీఠాన్ని కూలద్రోయాలని దేవుడు గిద్యోనుకు మొదట చెప్పాడు. అయితే ప్రజల విషయంలో గిద్యోను భయపడ్డాడు, అతను రాత్రిపూట వరకు వేచి ఉన్నాడు అప్పుడు అతడు బలిపీఠాన్ని పడగొట్టి దానిని సమూలంగా నాశనం చేసాడు. దానికి సమీపంలోనే గిద్యోను దేవునికి ఒక క్రొత్త బలిపీఠాన్ని నిర్మించాడు, దానిమీద దేవునికి హోమబలి అర్పించాడు.
మరుసటి ఉదయం బలిపీఠం ముక్కులుగా చెయ్యబడడం, అది పూర్తిగా నాశనం కావడం ప్రజలు, వారు చాలా కోపగించుకొన్నారు. వారు గిద్యోనును చంపడానికి అతని ఇంటికి వెళ్ళారు. అయితే గిద్యోను తండ్రి ఇలా చెప్పాడు, “మీరు మీ దేవునికి సహాయం చెయ్యడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అతను దేవుడు అయితే తనను తాను కాపాడుకోనివ్వండి!” ఆ విధంగా చెప్పిన కారణంగా ప్రజలు గిద్యోనును చంపలేదు.
అప్పుడు మిద్యానీయులు తిరిగి ఇశ్రాయేలీయుల నుండి దోచుకోడానికి వచ్చారు. గిద్యోను ఇశ్రాయేలీయులందరినీ ఒక చోట సమావేశపరచాడు, యుద్ధం చెయ్యాలని వారికి చెప్పాడు. దేవుడు ఇశ్రాయేలీయులను కాపాడడానికి తనతో మాట్లాడాడు అనేది వాస్తవమైతే రెండు రుజువులు చూపించాలని గిద్యోను దేవుణ్ణి అడిగాడు.
మొదటి గురుతుకోసం, గిద్యోను నేలమీద ఒక గొర్రె చర్మం ఉంచాడు, ఉదయానికి గొర్రె చర్మం మీద మాత్రమే మంచు కురవాలి, దాని చుట్టూ ఉన్న నేలమీద మంచు కురవకూడదు అని దేవుణ్ణి అడిగాడు. దేవుడు ఆ విధంగానే చేసాడు. మరుసటి రాత్రి, ‘నేల తడిగా ఉండాలి, గొర్రె చర్మం పొడిగా ఉండాలి’ అని గిద్యోను దేవుణ్ణి అడిగాడు. దేవుడు ఆ విధంగా కూడా చేసాడు. ఈ రెండు సూచనలను బట్టి మిద్యాను ప్రజల నుండి ఇశ్రాయేలీయులను రక్షించాలని దేవుడు నిజంగా కోరుకున్నాడని గిద్యోను విశ్వసించాడు.
అప్పుడు గిద్యోను తన దగ్గరకు సైనికులను పిలిచాడు, 32,000 మంది వచ్చారు. అయితే ‘వారు చాలా అధికం’ అని దేవుడు కాబట్టి యుద్ధానికి భయపడిన వారందరినీ గిద్యోను 22,000 మంది ఇంటికి పంపించాడు. ఇంకా ఎక్కువమంది ఉన్నారని దేవుడు గిద్యోనుకు చెప్పాడు. కనుక గిద్యోను 300 మంది సైనికులను తప్పించి మిగిలిన వారందరినీ తమతమ ఇళ్ళకు పంపించాడు.
ఆ రాత్రి దేవుడు గిద్యోనుతో ఇలా చెప్పాడు, "మిద్యాను సైన్య శిబిరం వద్దకు వెళ్లి, అక్కడ సైనికులు మాట్లాడుతున్న దానిని వినాలని చెప్పాడు. వారు మాట్లాడుతున్నదానిని నీవు వినిన యెడల వారి మీదకు దండెత్తడానికి నీవు భయపడవు.” ఆ రోజు రాత్రి, గిద్యోను శిబిరానికి వెళ్ళి, ఒక మిద్యాను సైనికుడు మరొక మిద్యాను సైనికుడితో తనకు వచ్చిన కలను గురించి పంచుకొన్నాడు. “గిద్యోను సైన్యం మిద్యాను సైన్యం అయిన మనలను జయిస్తుంది అని ఈ కల అర్థం!” గిద్యోను ఈ మాట వినినప్పుడు అతడు దేవుణ్ణి ఆరాధించాడు.
అప్పుడు గిద్యోను తన సైనికుల వద్దకు తిరిగి వచ్చాడు, వారిలో ప్రతి ఒక్కరికీ ఒక కొమ్ము, ఒక మట్టి కుండ, ఒక కాగడా ఇచ్చాడు. మిద్యాను సైనికులు నిద్రపోతున్న శిబిరాలను వారు చుట్టుముట్టారు. గిద్యోనుతో ఉన్న 300 సైనికులు తమ మట్టి కుండలలో కాగడాలు ఉంచుకున్నారు, తద్వారా మిద్యానీయులు వారిని గమనించలేదు.
అప్పుడు, గిద్యోను సైనికులందరూ తమ కుండలను పగులగొట్టారు, అకస్మాత్తుగా కాగాడాలలోని అగ్నిని చూపించారు. వారు తమ చేతులలోని బూరలు గట్టిగా ఊదారు, “యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం” అని అరిచారు
దేవుడు మిద్యానీయులను గందరగోళ పరిచాడు, తద్వారా వారు ఒకరినొకరి మీద దాడి చేసుకొని ఒకరినొకరు చంపుకోవడం ఆరంభించారు. తక్షణమే, గిద్యోను మిద్యానీయులను తరమడానికి ఇశ్రాయేలీయులలో అనేకమందిని తమ తమ గృహాలనుండి పిలవడానికి తన వార్తాహరులను పంపించాడు. వారు మిద్యానీయులలో అనేకమందిని హతం చేసారు. మిగిలిన వారిని ఇశ్రాయేలీయుల భూమి నుండి వెలుపలికి తరిమి వేశారు. ఆ దినాన్న 120,000 మంది మిద్యాను ప్రజలు చనిపోయారు. ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలీయులను రక్షించాడు.
గిద్యోనును తమ రాజుగా చేసుకోవాలని ఇశ్రాయేలీయులు కోరుకున్నారు. అందుకు గిద్యోను వారిని అనుమతించలేదు. అయితే వారు మిద్యానీయుల నుండి తీసుకున్న బంగారు ఆభరణలలో కొన్నింటిని తీసుకొని రావాలని వారిని అడిగాడు. ప్రజలు గిద్యోనుకు పెద్ద మొత్తంలో బంగారం ఇచ్చారు.
ఆ తర్వాత గిద్యోను తన వద్ద ఉన్న బంగారంతో యాజకుడు వినియోగించే ప్రత్యేక వస్త్రాలను తయారు చేసాడు. అయితే ప్రజలు దానిని ఒక విగ్రహంగా ఆరాధించడం ప్రారంభించారు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులు విగ్రహాన్ని పూజించినందున మరలా శిక్షించాడు. వారి శత్రువులు వారిని వారిని ఓడించటానికి దేవుడు వారిని అనుమతించాడు. చివరకు వారు మరలా సహాయం కోసం దేవుణ్ణి అడిగారు, వారిని రక్షించడానికి దేవుడు వారికోసం మరొక విమోచకుని పంపించాడు.
ఇదే సంఘటన అనేక సార్లు జరిగింది:శ్రాయేలీయులు పాపం చెయ్యడం, దేవుడు వారిని శిక్షించడం, వారు పశ్చాత్తాపం చెందడం, వారిని రక్షించడానికి దేవుడు కొందరు విమోచకులను పంపించడం. ఇశ్రాయేలీయులను తమ శత్రువుల నుండి రక్షించడానికి అనేక సంవత్సరాలుగా అనేకమంది మనుష్యులను దేవుడు పంపించాడు.
అంతిమంగా, ప్రజలు ఇతర దేశాల వలె వారికీ ఒక రాజు కావాలని దేవుణ్ణి కోరారు. ఎత్తుగానూ, బలంగానూ తమని యుద్ధంలో నడిపించగల రాజు కావాలని కోరారు. దేవుడు ఈ మనవిని ఇష్టపడలేదు, కానీ వారు అడిగినట్టుగా వారికి రాజును ఇచ్చాడు.