unfoldingWord 24 - బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసుకు బాప్తిస్మం ఇవ్వడం

રૂપરેખા: Matthew 3; Mark 1; Luke 3; John 1:15-37
સ્ક્રિપ્ટ નંબર: 1224
ભાષા: Telugu
પ્રેક્ષકો: General
હેતુ: Evangelism; Teaching
Features: Bible Stories; Paraphrase Scripture
સ્થિતિ: Approved
સ્ક્રિપ્ટો અન્ય ભાષાઓમાં અનુવાદ અને રેકોર્ડિંગ માટે મૂળભૂત માર્ગદર્શિકા છે. દરેક અલગ-અલગ સંસ્કૃતિ અને ભાષા માટે તેમને સમજી શકાય તેવું અને સુસંગત બનાવવા માટે તેઓને જરૂરી અનુકૂલિત કરવા જોઈએ. ઉપયોગમાં લેવાતા કેટલાક શબ્દો અને વિભાવનાઓને વધુ સમજૂતીની જરૂર પડી શકે છે અથવા તો બદલી અથવા સંપૂર્ણપણે છોડી દેવામાં આવી શકે છે.
સ્ક્રિપ્ટ ટેક્સ્ટ

జకర్యా, ఎలిజబెత్ కుమారుడు యోహాను పెరిగి పెద్దవాడై ఒక ప్రవక్త అయ్యాడు. అరణ్యంలో నివాసం చేసేవాడు, అడివి తేనె, మిడుతలు అతనికి ఆహారం. ఒంటె రోమాన్ని తన వస్త్రాలుగా ధరించేవాడు.

అనేకమంది ప్రజలు యోహాను మాటలు వినడానికి అరణ్యంలో ఉన్న యోహాను వద్దకు వచ్చేవారు. ఆయన వారికి బోధించేవాడు, “దేవుని రాజ్యం సమీపంగా ఉంది, పశ్చాత్తాప పడండి” అని బోధించేవాడు.

ప్రజలు యోహాను సందేశాన్ని వినినప్పుడు వారిలో అనేకమంది తమ పాపాల విషయంలో పశ్చాత్తాప పడేవారు. యోహాను వారికి బాప్తిస్మం ఇచ్చేవాడు. అనేకమంది నాయకులు కూడా యోహాను వద్దకు వచ్చేవారు. అయితే వారు తమ పాపాల విషయంలో పశ్చాత్తాపపడేవారు కాదు.

యోహాను ఆ మతనాయకులకు ఇలా చెప్పేవాడు, “సర్పసంతానమా! పశ్చాత్తాప పడండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మంచి ఫలం ఫలించని ప్రతీ చెట్టును దేవుడు నరికివేస్తాడు. వాటిని అగ్నిలో వేస్తాడు.” నీకు ముందుగా నేను ఒక ప్రవక్తను పంపుదును, ఆయన నీ మార్గమును సరాళము చేయును” అని చెప్పిన మాటలను యోహాను నెరవేర్చాడు.

కొందరు మత నాయకులు మెస్సీయ తానేనా అని యోహానును అడిగారు. యోహాను ఇలా జవాబిచ్చాడు, “నేను మెస్సీయను కాదు, అయితే ఆయన నా వెనుక వచ్చును. ఆయన చెప్పుల వారునైన విప్పుటకు నేను యోగ్యుడను కాను, ఆయన గొప్పవాడు.”

తరవాత రోజు ప్రభువైన యేసు బాప్తిస్మం కోసం యోహాను వద్దకు వచ్చాడు. యోహాను ఆయనను చూచినప్పుడు, యోహాను ఇలా చెప్పాడు, “ఇదిగో లోక పాపములు మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల.”

యోహాను యేసుతో ఇలా చెప్పాడు, “నీకు బాప్తిస్మం ఇవ్వడానికి నేను యోగ్యుడను కాను. అయితే యేసు ఇలా చెప్పాడు, “నీవు నాకు బాప్తిస్మం ఇవ్వాలి. ఎందుకంటే నీతి యావత్తూ ఈ విధంగా జరగవలసి ఉంది.” కనుక యోహాను యేసుకు బాప్తిస్మం ఇచ్చాడు, యేసు ఏవిధమైన పాపం చెయ్యలేదు.

యేసు బాప్తిస్మం తీసుకొని నీటిలోనుండి బయటికి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ పావురం వలే అగుపడి ఆయన మీదకు వచ్చి నిలిచింది. అదే సమయంలో పరలోకంనుండి దేవుడు పలికాడు, “నీవు నా ప్రియ కుమారుడవు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీ యందు ఆనందించుచున్నాను.”

దేవుడు యోహానుకు ఇలా చెప్పాడు, “పరిశుద్ధాత్ముడు కిందకు దిగి నీవు బాప్తిస్మం ఇచ్చిన వారిలో ఎవని మీద నిలుచునో ఆయన దేవుని కుమారుడు.” ఒక్కడే దేవుడు ఉన్నాడు. అయితే యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పుడు, తండ్రియైన దేవుడు స్వరాన్ని విన్నాడు, దేవుని కుమారుణ్ణి చూచాడు, ఆయన ప్రభువైన యేసు. పరిశుద్ధాత్మను కూడా చూచాడు.