unfoldingWord 26 - యేసు తన పరిచర్యను ఆరంభించడం
Raamwerk: Matthew 4:12-25; Mark 1-3; Luke 4
Skripnommer: 1226
Taal: Telugu
Gehoor: General
Doel: Evangelism; Teaching
Kenmerke: Bible Stories; Paraphrase Scripture
Status: Approved
Skrips is basiese riglyne vir vertaling en opname in ander tale. Hulle moet so nodig aangepas word dat hulle verstaanbaar en relevant is vir elke verskillende kultuur en taal. Sommige terme en konsepte wat gebruik word, het moontlik meer verduideliking nodig of selfs heeltemal vervang of weggelaat word.
Skripteks
ప్రభువైన యేసు సాతాను శోధనల నుండి వచ్చిన తరువాత ఆయన గలిలయ ప్రాంతానికి తిరిగి వచ్చాడు. ఇక్కడ ఆయన నివసించాడు. పరిశుద్ధాత్ముడు ఆయనకు గొప్పశక్తిని ఇచ్చాడు. యేసు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తున్నాడు. ప్రజలకు బోధిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఆయన గురించి మంచి సంగతులు పలుకుతున్నారు.
యేసు నజరేతు పట్టణానికి వెళ్ళాడు. యేసు బాలుడిగా ఉన్నప్పుడు ఇక్కడ జీవించాడు. ఒక సబ్బాతు దినాన్న ఆయన ఆరాధనా స్థలానికి వెళ్ళాడు. మత నాయకులు ఆయన చేతికి ప్రవక్త యెషయా లేఖన చుట్టలను ఇచ్చారు. ఆయనను దానిని నుండి చదవాలని అడిగారు. కనుక యేసు ఆ చట్టను తెరచి ప్రజల కోసం చదివాడు.
యేసు ఇలా చదివాడు, “దీనులకు సువార్తను ప్రకటించడానికి దేవుడు తన ఆత్మను నా మీద ఉంచాడు. చెరలో ఉన్నవారిని విడిపించడానికి ఆయన నన్ను పంపించాడు. చూపులేనివారికి తిరిగి చూపును ప్రసాదించడానికి ఆయన నన్ను పంపించాడు. నలిగిన వారికి స్వేచ్చనివ్వడానికి నన్ను పంపాడు. ఆయన మన యెడల దయగలిగి, మనకు సహాయం చేసే సమయం వచ్చింది.”
ఆ లేఖనాలను చదివి యేసు కూర్చున్నాడు. ప్రతి ఒక్కరూ ఆయనను గమనిస్తున్నారు. తాను అప్పుడే చదివిన లేఖన భాగం మెస్సీయను గురించినదే అని ఆయనకు తెలుసు. యేసు ఇలా చెప్పాడు, “నేనిప్పుడు చదివిన ఈ లేఖనం మన వినికిడిలో నెరవేరింది.” ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. “ఇతడు యోసేపు కుమారుడు కాదా?” అని అన్నారు.
అప్పుడు యేసు ఇలా అన్నాడు, “స్వదేశంలో ఉన్న ప్రవక్తను ప్రజలు అంగీకరించరు అనేది సత్యమే. ఏలియా కాలంలో ఇశ్రాయేలులో విధవరాండ్రు అనేకమంది ఉన్నారు. అయితే అక్కడ మూడున్నర సంవత్సరాలు వర్షం లేదు. ఇశ్రాయేలులో ఉన్న విధవరాళ్ళకు సహాయం చెయ్యడం కోసం దేవుడు ఏలియాను పంపించలేదు, దానికి బదులు మరో దేశంలో ఉన్న విధవరాలి వద్దకు దేవుడు ఏలియాను పంపించాడు.
యేసు ఇంకా చెప్పడం కొనసాగించాడు. “ఎలిషా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలులో అనేకులు మంది చర్మ రోగులు ఉన్నారు, అయితే వారిని స్వస్థపరచదానికి దేవుడు అక్కడికి ఎలిషాను పంపించలేదు. ఇశ్రాయేలీయుల శత్రువుల సైన్యాధిపతి నయమానుకున్న కుష్టరోగాన్ని మాత్రమే బాగుచేసాడు.” అయితే యేసు మాటలు వింటున్నవారు మాత్రం యూదులు. కాబట్టి యేసు చెప్పిన ఈ మాటను వినినవారు ఆయనమీద కోపగించుకొన్నారు.
నజరేతు ప్రజలు యేసును పట్టుకొన్నారు, ఆరాధనా స్థలంనుండి వెలుపలికి ఈడ్చుకుపోయారు. పట్టణం అంచు వరకూ ఆయనను తీసుకొని వెళ్లి చంపాలని చూసారు. అయితే యేసు సమూహంలోనుండి తప్పించుకొని నజరేతు పట్టణాన్ని విడిచి వెళ్ళాడు.
అప్పుడు యేసు గలిలయ ప్రాంతం అంతా సంచారం చేసాడు, గొప్ప జనసమూహాలు ఆయన వద్దకు వచ్చారు. వారు రోగులను, అవిటివారిని అనేకులను ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. వారిలో కొందరు చూడలేనివారు, కొందరు నడవలేని వారు, కొందరు వినలేనివారు, కొందరు మాట్లాడలేని వారు. యేసు వారినందరినీ స్వస్థపరచాడు.
దయ్యాలు పట్టినవారు అనేకులలో నుండి ఆయన దయ్యాలను పారదోలాడు. వారిలో నుండి దయ్యాలను బయటికి రావాలని ఆయన వారికి ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞప్రకారం ఆ దయ్యాలు వెలుపలికి వచ్చాయి. దయ్యాలు ఆయనను చూచి గట్టిగా అరిచాయి, “నీవు దేవుని కుమారుడవు!” జనసమూహాలు ఆయనను చూచి ఆశ్చర్యపడ్డారు, వారు దేవుని స్తుతించారు.
తరువాత ప్రభువైన యేసు పన్నెండు మందిని ఎంపిక చేసుకొన్నాడు, వారిని అపొస్తలులు అని పిలిచాడు. ఈ అపొస్తలులు యేసుతో ప్రయాణం చేసారు, ఆయన నుండి నేర్చుకొన్నారు.